రైతుల యూరియా కష్టాలు  క‌నిపించ‌డం లేదా బాబూ..?

నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల‌:  యూరియా కోసం రైతులు తల్లడిల్లిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వారి క‌ష్టాలు క‌నిపించ‌డం లేదా అని నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి మండిప‌డ్డారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..` వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ..ఏ సీజ‌న్‌కు సంబంధించిన ఇన్‌ఫుట్ స‌బ్సిడీ అదే సీజ‌న్‌లో ఇచ్చాం. రైతులకు చెప్పిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని అందజేసిన ప్రభుత్వం మాది. కూట‌మి ప్ర‌భుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మ‌రించింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పొగాకు , మామిడి , మిర్చి , టమోటా,  ఉల్లి రైతులకు గిట్టు బాటు ధర లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం లో రైతులు పండించిన పంటను అమ్ముకోవాలంటే గిట్టు బాటు ధర ఉండదు ,మార్కెట్లో దళారులు మాత్రం ఆమ్ముకోవాలంటే ధర  ఉంటుంది. చంద్రబాబు నాయుడు అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం కింద‌ రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులు కలుపుకొని రూ. 26,000 ఇస్తామని చెప్పి ఇవాళ రైతులను మోసం చేశాడు.  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్‌బీకేలు పెట్టి రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రతీ ఎరువును స‌కాలంలో అందించేవారు. వైయ‌స్ జ‌గన్ మోహన్ రెడ్డి అమ‌లు చేసిన‌ సంక్షేమ పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు అందజేస్తామని చెప్పి ఇవాళ ప్రజలను టిడిపి ప్రభుత్వం మోసం చేసింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు ఈనెల తో 9వ తేదీన నంద్యాల జిల్లా లోని అన్ని నియోజకవర్గాల లో రైతుల సమస్యలపై ఆర్‌డీవోకు విన‌తిప‌త్రం అంద‌జేస్తాం`అని కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు.

Back to Top