ఉప్పాల హారిక‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

మంత్రి కొల్లు ఇంటి ముందు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతల నిరసన 

 కృష్ణా జిల్లా: ఉప్పాల హారికకు కొల్లురవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ..మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి ముందు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలు నిరసనకు దిగారు. జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై మండిపడ్డారు. చీపుర్లతో కొల్లు రవీంద్ర ఫోటోలను కొడుతూ నిరసన వ్యక్తం చేశారు.   బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర అంటూ నినాదాలు చేశారు. 

మహానటి కంటే ఎక్కువ అంటే మీ ఇంట్లోవాళ్లేనా?. మీ ఇంట్లో ఆడవాళ్ల గురించైతే  ఇలానే మాట్లాడతారా? అంటూ నిలదీశారు. ఉప్పాల హారిక భర్త రాముపై కేసు పెట్టడం దుర్మార్గం. తక్షణమే మంత్రి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాలి. ఉప్పాల హారికకు క్షమాపణ చెప్పేవరకూ మా పోరాటం ఆగదు’’ వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేతలు హెచ్చరించారు.

Back to Top