చంద్ర‌బాబు మోసంపై ఇంటింటా ప్ర‌చారం

తిరుప‌తి న‌గ‌రంలో `రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో..` కార్య‌క్ర‌మం

తిరుప‌తి:  చ‌ద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం ఏడాది కాలంలో ప్ర‌జ‌ల‌కు చేసిన మోసాన్ని తిరుప‌తి న‌గ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఇంటింటా ప్ర‌చారం చేశారు. సోమ‌వారం తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో 1వ వార్డులో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటా ప‌ర్య‌టించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ఈ ప్ర‌భుత్వంలో జ‌రిగిన మోసాల‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో నార్త్ మండలం వార్డులకు చెందిన కార్పొరేటర్లు, అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top