మ‌న ఆయుధం సోష‌ల్ మీడియానే

వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్  

అనంత‌పురంలో సోష‌ల్ మీడియా విభాగం విస్తృత స్థాయి స‌మావేశం

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోష‌ల్ మీడియానే ప్ర‌ధాన ఆయుధ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుదామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఆదివారం అనంత‌పురంలో సోష‌ల్ మీడియా విభాగం విస్తృత స్థాయి స‌మావేశంనిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..` కూటమి పార్టీలకు చేతి వేళ్ళతో లెక్క పెట్టే ఎల్లో మీడియా మాత్రమే ఉంది , కానీ జగనన్నకు ఇసుక వేస్తే రాలనంతా సోషల్ మీడియా ఉంది.  పార్టీ అన్ని అనుబంధ సంస్ధలల్లో కల్లా మన సోషల్ మీడియా విభాగమే చాలా ప్రధానమైనది.గతంలో ఇబ్బందులు పడ్డాం.. వాటన్నింటినీ మరోసారి పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది.  పార్టీ లోని అన్ని అనుబంధ విభాగాలను సోషల్ మీడియా విభాగం వారు సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.  సోషల్ మీడియా లో వ్యక్తి గత దూషణలకు తావు ఇవ్వొద్దు.  మన పార్టీ కి సోషల్ మీడియానే ప్రధానమైనది , ప్రతి ఒక సమస్య ను పార్టీ గౌరవ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి గారి ప్రత్యేక దృష్టితో పరిష్కారిస్తున్నారు` అని బాబా స‌లాం పేర్కొన్నారు.

అనంత వెంకటరామిరెడ్డి కామెంట్స్‌ :

  • ప్రపంచమంతా డిజిటల్‌ యుగంలో ముందుకెళ్తోంది. మన అభిప్రాయాలను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పడంలో సోషల్‌ మీడియా వేదికగా మారిపోయింది. 
  • వైఎస్‌ఆర్‌సీపీకి బలం సోషల్‌ మీడియా
  • 2014లో ఓడిపోయాక పార్టీ ఉండదని అంతా అన్నారు. వైఎస్‌ జగన్‌ను వేధించారు. అయినా పార్టీ బలంగా నిలబడిందంటే కార్యకర్తలే కారణం. 
  • వైసీపీకి 30 అనుబంధ విభాగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్‌ మీడియా విభాగంను ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని పూర్తి చేశాం. 
  • గతంలో వైయ‌స్‌ జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తే వైసీపీ సోషల్‌ మీడియా ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టాం.  
  • 2024లో మనం ఓడిపోయాం. 11 సీట్లు వచ్చింది వాస్తవం.. కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే వాళ్లకు 58 శాతం ఓట్లు వచ్చాయి. మనం సింగిల్‌గా పోటీ చేస్తే 42 శాతం ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి మనం ఎంత బలంగా ఉన్నామో అర్థం చేసుకోండి.
  • ప్రజాస్వామ్యంలో గెలుపు,ఓటములు సహజం. ఎవరూ నిరుత్సాహపడొద్దు.
  • సోషల్‌ మీడియాలో సృజనాత్మక పోస్టులు చేయండి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేయాలి. 
  • మన పార్టీకి ఉన్న ఒకే ఒక ఆయుధం సోషల్‌ మీడియా.
  • ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా కంటే వేగంగా జనంలోకి వెళ్లేది సోషల్‌ మీడియా. మీరంతా సమర్థవంతంగా పనిచేయండి. 
  • పని చేయడం మీ వంతు.. మీకు అండగా ఉండడం పార్టీ వంతు. ప్రతి ఒక్కరికీ భవిష్యత్‌లో న్యాయం చేస్తాం.
  • కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. 
  • వైసీపీ పాలనలో ఏకంగా రూ.2.80 లక్షల కోట్లు రాజకీయాలకు అతీతంగా పేదలకు అందించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది. 
  •  రాష్ట్రంలో మెజార్టీ మీడియా చంద్రబాబు చేతుల్లోనే ఉంది. ఇలాంటి తరుణంలో మనం బలంగా ప్రజల వాణిని వినిపించాలి. అధికార పార్టీకి ధీటుగా జవాబు చెప్పాలి.
  • సోషల్‌ మీడియాను ఆయుధంగా మార్చుకుందాం. మళ్లీ జగన్‌ను సీఎంగా చేసుకుందాం. 
  • కూటమి వచ్చాక రైతుల పరిస్థితి దారుణం.. గతంలో మనం ఉచిత ఇన్సూరెన్స్‌ తెచ్చాం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. 
  • సూపర్‌ సిక్స్‌ హామీలతో చంద్రబాబు ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచారు. 
  • వైయ‌స్ జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామన్నారు. సంపద సృష్టిస్తామన్నారు. కానీ ఒక్కటైనా చేశారా? 
  • ఏడాదిగా ప్రజలకు కూటమి ప్రభుత్వం రూ.81 వేల కోట్లు బాకీ పడింది. 
  • అమ్మ ఒడి పథకం వచ్చిందంటే అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం వల్లే
  • అర్హత ఉండి ఏ ఒక్కరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయండి. 
  • కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సోషల్‌ మీడియా కార్యకర్తల మీదే మొదట కేసులు పెట్టింది. అందుకే వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా లీగల్‌ టీంలు, టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. 
  • మీరంతా ధైర్యంగా ఉండండి.. ఎవరూ అధైర్య పడొద్దు. ఏ సమస్య ఉన్నా మీ నియోజకవర్గాల సమన్వయకర్తల దృష్టికి తీసుకెళ్లండి. 
  • ఎలా పడితే అలా కేసులు పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయం అందరూ గుర్తించండి. 
  • మనమంతా నైతిక విలువలతో వెళ్దాం. అసభ్య పోస్టింగ్స్‌ పెట్టొద్దు. 
  • అనంతపురంలో రూ.118 కోట్లు తెచ్చామని ప్రజాప్రతినిధులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా తెచ్చిన పనులకు సంబంధించి జీవోలు, ఆర్డర్లు చూపించమంటే కళ్లు కనపడలేదా? అని విమర్శిస్తున్నారు.  
  • వాళ్లకు అధికారం నెత్తికెక్కింది. అందరూ కాదు గానీ, కొంత మంది ఎమ్మెల్యేలకు ఫ్రస్టేషన్‌ వస్తోంది.
  • వైఎస్‌ జగన్‌ బయటకు వస్తుంటే జనం బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని చూసి అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
  • గతంలో మనం చేసిన మంచిని మరోసారి ప్రజలకు గుర్తు చేయండి. 
  • కూటమి ప్రభుత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. హంద్రీనీవాను వెడల్పు చేయమంటే అవాకులు, చవాకులు పేలుతున్నారు. 
  • రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. మీరంతా భాగస్వాములై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. 
  • బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ ‘‘క్యూ ఆర్‌ కోడ్‌’’కు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయండి. ప్రజలకు అవగాహన కల్పించండి.
Back to Top