క్యాసినోకు అడ్డాగా మారిన ప్రొద్దుటూరు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఆగ్ర‌హం

వైయ‌స్ఆర్ జిల్లా:  తెలుగుదేశం పార్టీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు క్యాసినో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింద‌ని  మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..` టీడీపీ ముఖ్య నాయకులు మట్కా, జూదం క్రికెట్ బెట్టింగ్ తో పాటు గోవా లో క్యాసినో నిర్వహిస్తున్నారు.  ప్రొద్దుటూరు లో గంజాయి విచ్చల విడిగా అమ్ముతున్నారు. కడప నుండి గోవా, హైదరాబాద్ నుండి గోవా, బెంగుళూరు నుండి గోవా కు  నిర్వాహకులు ఈ నెల 23, 24, 25 వ తేదీన ఇండిగో విమానంలో టికెట్ లు బుక్ చేశారు. ప్రొద్దుటూరులో కూట‌మి నేత‌లు విచ్చ‌ల‌విడిగా జూదం నిర్వహిస్తున్నా..పోలీసులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఆపాల‌ని టీడీపీ నాయ‌కుల‌ను కోరుతున్నాను. మీ చ‌ర్య‌ల వ‌ల్ల యువత పెడదోవ పట్టే ప్ర‌మాదం ఉంది. జిల్లా  యువ ఎస్పీ ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుక‌ట్ట వేయాల‌ని కోరుతున్నాను. ఇక్క‌డితో ఇది ఆప‌క‌పోతే రాష్ట్ర‌మంత‌టా విస్త‌రిస్తుంది. ప్రొద్దుటూరు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నారు. నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు, పేదవాడి రక్తాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తాగుతున్నారు. ఇలాంటి దుశ్చ‌ర్య‌లు మంచివి కావు` అంటూ రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి హిత‌వు ప‌లికారు.

Back to Top