భూమన క‌రుణాక‌ర్‌రెడ్డికి నోటీసులు

తిరుపతి:  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి ఎస్వీ వర్శిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 23న  ఉదయం 11 గంటలకు విచారణ హాజరుకావాలంటూ భూమనకు నోటీసులు జారీ చేశారు. 

Back to Top