తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి వై.యస్. భారతి రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్ వేడుకలు నిర్వహించారు. విజయవాడ నిర్మల శిశుభవన్‌లో వేడుకలు తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని నిర్మలా శిశుభవన్‌లో వైయస్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , కార్పొరేటర్ అడపా శేషు, పలువురు పార్టీ నాయకులు చిన్నారులతో కేక్ కట్ చేసి భారతి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యోనా రాజు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, నాయకులు కిరణ్, అశోక్ యాదవ్, శివ, సురేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మహిళా విభాగం వేడుకలు జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో వైయస్ భారతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నగర మేయర్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజా రెడ్డి, కార్పొరేటర్లు నిర్మలాకుమారి, రహేన నాహీద్, మహిళా నాయకులు స్వప్న, సుభాషిణి, సౌమ్య, ఇందిరా, లక్ష్మి, రమణ, శ్రావణి, సునీత, రుబిన్ తదితరులు పాల్గొన్నారు. భారతి అమ్మగారు కుటుంబ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ జననేత వైయస్ జగన్ గారికి ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తున్నారని మహిళా నాయకురాళ్లు అభినందించారు. నంద్యాల జిల్లాలో వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ భారతిరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైయస్ భారతి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ, ఎస్వీ విజయ మనోహరి, కార్పొరేటర్లు , పార్టీ ముఖ్య నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు నగరంలో.. కర్నూలు నగరంలోని వైయస్ భారతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.వి. విజయ మనోహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మహిళా నాయకురాళ్లు, కార్పొరేటర్లు పాల్గొని భారతమ్మ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.