విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమరావతి చట్టం పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచుతోందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైయస్. జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) అభివృద్ధి కారిడార్‌పై చర్చకు సిద్ధమా అని కూటని నేతలకు సవాల్ విసిరారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మళ్లీ అమరావతి చట్టం పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచే ‘షో పాలిటిక్స్’కు తెరలేపిందని వైయస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆదివారం వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు తన ఏడేళ్ల పాలనలో అమరావతిలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కేవలం ఏడెనిమిది భవనాలు కట్టి దాన్ని రాజధాని అని పిలవడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. దీనికి భిన్నంగా వైయస్.జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) గ్రోత్ ఇంజిన్ కారిడార్ ద్వారా తక్కువ ఖర్చుతో, ఇప్పటికే ఉన్న పోర్ట్, ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్ల అనుసంధానంతో 60 లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల అప్పులు చేసి భవిష్యత్తు తరాలపై భారం మోపడం కంటే, జగన్ గారి ప్రత్యామ్నాయ ప్రణాళికపై చర్చకు రావాలని వారు కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు." ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... ● వెల్లంపల్లి శ్రీనివాస్ - మాజీ మంత్రి: చంద్రబాబు ఏడేళ్ల పాలనలో కదలని అమరావతి పనులు. 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామన్న చంద్రబాబు, ఇప్పుడు అది 'నిరంతర ప్రక్రియ' అని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. ఐదారు భవనాలతో రాజధాని అయిపోతుందా?. కేవలం రూ. 20 వేల కోట్లతో పోర్ట్, ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ 50 లక్షల మందికి మేలు జరిగేలా రాజధాని నిర్మించవచ్చన్న వైయస్.జగన్ ప్రతిపాదనలో తప్పేముంది.వైయస్.జగన్ హయాంలోనే కనకదుర్గ ఫ్లైఓవర్, రిటైనింగ్ వాల్ పూర్తై ప్రారంభోత్సవం చేసుకోగా, వెస్ట్రన్ బైపాస్ పనులు 90% పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. అమరావతి అంటే ఏడెనిమిది భవనాలు కట్టి.. ప్రభుత్వ సంస్ధలు పెడితే సరిపోతుందా? దాంతో అమరావతి అభివృద్ధి అయిపోతుందా? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇక్కడ రాజధానికి అనుకూలమా? వ్యతిరేకమా? సూటిగా సమాధానం చెప్పాలి. ● దేవినేని అవినాష్ - వైయస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు: "విజయవాడ నగరం గొంతు నులిమిన చంద్రబాబు" అమరావతి కోసం చంద్రబాబు విజయవాడ నగరాన్ని విస్మరిస్తున్నారు. విజయవాడలో ఒక్క అభివృద్ధి పని కూడా ఆయన చేపట్టలేదు. పైగా బందరు రోడ్డును గ్రీన్ జోన్ చేసి సామాన్యుల ఆస్తుల విలువను దెబ్బతీశారు. కానీ విజయవాడ అభివృద్ధికి కంకణం కట్టుకున్నది మాత్రం వైయస్.జగనే. వరదల నుంచి విజయవాడను కాపాడటానికి రిటైనింగ్ వాల్ కట్టిన అభివృద్ధి ప్రదాత వైయస్.జగన్. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేకపోయారు. పైగా వైయస్. గన్ కి కులం, మతం అంటగట్టడం సిగ్గుచేటు. అన్ని సామాజిక వర్గాల పెద్దలకు పనులు చేసి పెట్టిన గొప్ప నాయకుడు వైయస్.జగన్. మొన్నటి ఎన్నికల్లో పార్టీ మారి భజన చేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ వంటి వారిని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు భజన చేస్తున్నారు. ఇదే పెద్ద మనిషి ఆ రోజు వైయస్.జగన్ గారిని పొగడ్తలతో ముంచాడు. పార్టీ మారగానే భజన కూడా మారింది. వైయస్.జగన్, వైయస్సార్సీపీ పై విషప్రచారం చేయడానికి కూటమి నేతలకు సిగ్గుందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ● మల్లాది విష్ణు - మాజీ ఎమ్మెల్యే: "గ్రోత్ ఇంజిన్ కారిడార్‌గా ‘మావిగన్’.. మేధావులు చర్చించాలి" అమరావతి పేరుతో జరుగుతున్న అప్పుల భారాన్ని, అవినీతిని వైయస్.జగన్ ఎండగట్టారు. రూ. 2 లక్షల కోట్ల అప్పు కంటే, ఉన్న వనరులను వాడుకుని మూడు నగరాలను మహానగరంగా మార్చడమే మేలు. తొలి విడతలో భూములిచ్చిన రైతులకే ఇంతవరకు రిటర్న్ ప్లాట్లు ఇవ్వకుండా, మళ్లీ 50 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ అంటే అది ముమ్మాటికీ రైతులను వంచించడమే. ఇది చాలా దుర్మార్గం. వాస్తవానికి వైయస్.జగన్, వైయస్సార్సీపీ కానీ అమరావతికి వ్యతిరేకం కాదు.కేవలం అక్కడ జరుగుతున్న దోపిడీకే వ్యతిరేకం. గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉండగా కొత్తది కట్టడం, రైల్వే స్టేషన్ ఉండగా వేల ఎకరాలు సేకరించడం ప్రజాధనం దుర్వినియోగం కాదా?. అని నిలదీశారు. ఈ నేపధ్యంలో ప్రజలకు కావాల్సింది అమరావతి చట్టం కాదని... కంటికి కనిపించే నిర్మాణం కావాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తెస్తున్న రూ. 3.50 లక్షల కోట్ల అప్పులే రాబోయే తరాలకు శాపంగా మారనున్నాయని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిల్లికజ్జాలు మాని, వైయస్.జగన్ ప్రత్యామ్నాయ ప్రణాలికపై ఆలోంచికపోతే 2019 నాటి ఫలితాలు పునరావృతం కావడం ఖాయమని హెచ్చరించారు.