తాడేపల్లి: కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత బాబూ జగ్జీవన్‌రామ్ గారి సేవలు చిరస్మరణీయం. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. తొలి దళిత ఉప ప్రధాని గా దేశానికి సేవలందించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.