ద‌ళితులను వేధిస్తున్న కూట‌మికి ప‌త‌నం ఖాయం

ద‌ళిత ఆడ‌బిడ్డ‌ల క‌న్నీళ్ల‌కు మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు

దాడులు, దౌర్జ‌న్యాల‌కు గ‌ట్టిగా బ‌దులిచ్చి తీరుతాం

బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి స‌భ‌లో ద‌ళిత నాయ‌కులు 

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్‌ జ‌యంతి వేడుక‌లు 

తాడేప‌ల్లి: కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక దళితుల‌పై దాడులు, వేధింపులు ఎక్కువైపోయాయ‌ని, ద‌ళిత మ‌హిళ‌ల‌ను న‌డి రోడ్డుపైన కూట‌మి నాయ‌కులు లాఠీలు, క‌ర్ర‌ల‌తో కొట్టి దాడి చేస్తున్నా సీఎం చంద్ర‌బాబుకి ఏమాత్రం ప‌ట్టడం లేద‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌ట్టాల‌ను అప‌హాస్యం చేస్తున్నారని, సాక్షాత్తూ శాస‌న‌స‌భ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు డ‌ప్పు కొడుతున్న ద‌ళితుడిని చెంప దెబ్బ కొట్టి వేధించ‌డం ద‌ళితుల ప‌ట్ల‌ ఈ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని మండిపడ్డారు. బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జయంతి కార్య‌క్ర‌మాన్ని తాడేప‌ల్లి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు ముందుగా బాబూ జ‌గ్జీవ‌న్‌రావు చిత్ర‌ప‌టం వ‌ద్ద జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేయ‌గా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు క‌లిసి ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పుష్పాంజ‌లి ఘ‌టించి జ‌యంతి కార్య‌క్ర‌మం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ దేశానికి చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. దళితుల అభ్యున్న‌తి కోసం దివంగ‌త వైయస్సార్ స‌బ్ ప్లాన్ తీసుకొస్తే, వైయ‌స్ జ‌గ‌న్ గారు రాజ‌కీయంగా ద‌ళితుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. ద‌ళితుల‌ను తీవ్రంగా వేధించి అవ‌మానిస్తున్న ఈ ప్ర‌భుత్వానికి స‌రైన స‌మ‌యంలో గ‌ట్టిగా బుద్ధి చెబుతామ‌ని ఎస్సీ నాయ‌కులు చెప్పారు. 

ఈ జ‌యంతి కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ మూర్తి, పార్టీ అధికార ప్ర‌తినిధి వేల్పుల ర‌వి, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 
● కూట‌మి పాల‌న‌లో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేదు 
- మ‌ల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే 

బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ చూపించిన మార్గంలో న‌డుస్తూ వైయ‌స్ జ‌గ‌న్ గారు వెనుబ‌డిన వర్గాల‌కు అన్ని విధాలుగా వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. ద‌ళితుల హ‌క్కులను కాపాడ‌టం కోసం తండ్రీకొడుకులు వైయ‌స్సార్‌, వైయ‌స్ జ‌గన్ లు ఎంతో త‌పించారు. ద‌ళితుల‌కు స‌బ్ ప్లాన్ తీసుకొచ్చిన ఘ‌న‌త దివంగ‌త వైయ‌స్సార్ కే ద‌క్కుతుంది. నేడు కూట‌మి ప్రభుత్వంలో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. న‌డిరోడ్డుపైన ద‌ళిత బిడ్డ‌లు తీవ్ర అవ‌మానాలు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. ద‌ళిత మ‌హిళ‌ల‌ను న‌డిరోడ్డు మీద దాడులు, దౌర్జ‌న్యాలు, అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. ద‌ళితుల ఉన్న‌తి కోసం, వారి హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం ప‌నిచేస్తున్న పార్టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే. 

● ద‌ళితుడిపై స్పీక‌ర్ దాడితో ప్ర‌భుత్వ వైఖ‌రి స్ప‌ష్టం
- వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి 

కేంద్ర మంత్రిగా సుదీర్ఘ‌కాలం ప‌నిచేసి భార‌త‌దేశానికి విశేష సేవ‌లందించ‌డ‌మే కాకుండా చ‌ట్టాల‌ను క‌ఠినంగా అమ‌లు చేసి చూపించిన ఘ‌న‌త బాబూ జగ్జీవ‌న్ రామ్ గారికే ద‌క్కుతుంది. నేటి నాయ‌కులంతా ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి. జ‌గ్జీవ‌న్‌రామ్ స్ఫూర్తితోనే వైయ‌స్ జ‌గ‌న్ గారు ద‌ళితుల అభ్యున్న‌తికై ప‌నిచేస్తున్నారు. కానీ చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ద‌ళితుల‌ను తీవ్రంగా వేధించి అవ‌మానిస్తున్నారు. సాక్షాత్తూ శాస‌న‌స‌భ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు డ‌ప్పు కొడుతున్న ద‌ళితుడిని చెంప దెబ్బ కొట్టడం వారి ప‌ట్ల ప్ర‌భుత్వ వైఖ‌రికి నిద‌ర్శ‌నం. ఇంత‌వ‌ర‌కు ఆయ‌న నుంచి క‌నీసం క్ష‌మాప‌ణ కూడా లేదు. ఎంతోమంది ద‌ళిత ఆడ‌బిడ్డ‌ల‌ను ఈ ప్ర‌భుత్వం తీవ్రంగా వేధిస్తోంది. నడి రోడ్డు మీద లాఠీలు, క‌ర్ర‌ల‌తో కొట్టి దాడి చేస్తూ స‌భ్యస‌మాజం త‌ల‌దించుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉన్న‌త స్థానాల్లో ఉన్న ద‌ళిత ఉద్యోగులు కూడా వేధింపుల‌కు మిన‌హాయింపులు కాదు. రాబోయే రోజుల్లో ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా గుణ‌పాఠం చెబుతారు. 

● 33 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా సేవ‌లందించారు
- కొమ్మూరి క‌న‌కారావు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ 

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధునిగానే కాకుండా ఆధునిక భార‌తదేశ నిర్మాణంలో కీల‌కపాత్ర పోషించిన రాజ్యాంగ ర‌చ‌న క‌మిటీలో స‌భ్యుడిగా దేశానికి విశేష సేవ‌లందించిన గొప్ప వ్య‌క్తి బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్‌ గారు. బాల్యం నుంచే అస్పృశ్య‌త‌, వివ‌క్ష‌త‌పై పోరాడిన గొప్ప నాయ‌కుడు. స్వాతంత్ర్యానికి పూర్వ‌మే పార్టీ పెట్టి ద‌ళితుల‌ను ఎమ్మెల్యేలుగా గెలిపించిన నాయకుడే కాకుండా బెస్ట్ పార్ల‌మెంటేరియ‌న్‌గా, కేంద్ర మంత్రిగా దేశానికి విశేష సేవ‌లందించారు.  సుదీర్ఘంగా 33 ఏళ్లపాటు దేశానికి కేంద్ర మంత్రిగా వివిధ శాఖ‌ల‌ను నిర్వ‌హించి గొప్ప ప‌రిపాల‌నా ద‌క్షుడిగా పేరు తెచ్చుకున్నారు. పాకిస్థాన్ మీద యుద్ధం స‌మ‌యంలో ఆయ‌న దేశ ర‌క్ష‌ణశాఖ మంత్రిగా ఉన్నారు. 

● ఓట‌మి ఎరుగని నాయ‌కుడు 
- వేల్పుల ర‌వి, పార్టీ అధికార ప్ర‌తినిధి

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే భార‌త‌దేశంలో నెలకొని ఉన్న అస‌మాన‌త‌, అప్ర‌జాస్వామ్యం, అంట‌రానిత‌నం, నిర‌క్షరాస్య‌త వంటి ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొంటూ పొరాటం చేసిన గొప్ప నాయ‌కుడు బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్. 1908 నుంచి చ‌నిపోయే వర‌కు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నిక‌వుతూ త‌న గొప్ప‌త‌నాన్ని చాటుకున్నారు. రైల్వే, వ్య‌వ‌సాయం, తంతిత‌పాలా, కార్మిక, ర‌క్ష‌ణ శాఖ వంటి ఎన్నో కీల‌కమైన శాఖ‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ప‌రిపాల‌నాద‌క్షుడు. అంబేడ్క‌ర్ రూపొందించిన రిజ‌ర్వేష‌న్ విధానాన్ని అమ‌లు చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు. జ్యోతిరావుపూలే, జ‌గ్జీవ‌న్‌రామ్, అంబేడ్క‌ర్, కాన్షీరామ్‌ల బాట‌లోనే దివంగ‌త వైయ‌స్సార్‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌లు కుల వివ‌క్ష మీద పోరాడారు. వైయ‌స్ జ‌గ‌న్ గారు అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని స్మృతి వ‌నాన్ని ఏర్పాటు చేసిన‌ట్టే, చంద్ర‌బాబుకి జ‌గ్జీవ‌న్‌రామ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసే ద‌మ్ముందా? కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ద‌ళితుల మీద జ‌రుగుతున్న దాడుల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోక‌ త‌ప్ప‌దు. వెనుక‌బ‌డిన వర్గాల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేని దుర్మార్గ ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు నడుపుతున్నాడు.

Back to Top