స్థానిక సంస్థ‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ గెలుపే లక్ష్యం 

మ‌ద‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త నిస్సార్ అహ్మద్ పిలుపు 

అన్నమయ్య జిల్లా: మదనపల్లె మండలం పొన్నుటిపాలెం గ్రామపంచాయితీ పరిధిలోని పనసమాకులపల్లెలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వ‌హించారు.  గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేస్తేనే విజయాన్ని సాధించగలమని, పార్టీ పదవులు అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

వైయ‌స్ జ‌గ‌న్‌ నాయకత్వంలో అమలైన సుపరిపాలన, ప్రజలకు చేరిన సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. జెపిటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్నకు కానుకగా అందించాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. క్లిష్ట సమయంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను ఎప్పటికీ మరవబోమని, కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ మునిసిపల్ చైర్మన్ వి. మనుజా రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ పరిశీలకులు జింక చలపతి, రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, మండల పరిశీలకులు డి. హర్షవర్ధన్ రెడ్డి, గ్రామ నాయకులు రాజకుమార్, బయ్యా రెడ్డి, రమణ, కృష్ణా రెడ్డి, భాస్కర్, కొత్తపల్లి మహేశ్, కొత్తపల్లి నాగార్జున, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, అనిల్, శారద రెడ్డి, మంజుల, నజీర్, వడిగల శ్రీకాంత్ రెడ్డి, మాలెపాడు చలపతి, భాను, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరిగిన ఈ సమావేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Back to Top