పార్టీ కమిటీలో క‌ష్ట‌ప‌డే కార్యకర్తలకు ప్రాధాన్యం

మాజీ మంత్రి తోట న‌ర‌సింహం

జగ్గంపేట:  జగ్గంపేట నియోజకవర్గంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య సమావేశం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించిన వివిధ కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియతో పాటు వాటర్ లిస్ట్ (ఒటర్ లిస్ట్) జాబితా పరిశీలనపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశానికి జగ్గంపేట నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు తోట న‌ర‌సింహం హాజరై నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

కమిటీల ఏర్పాటు పారదర్శకంగా, క్రమబద్ధంగా జరగాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో సభ్యుల వివరాలు ఖచ్చితంగా పరిశీలించి, నిజమైన, అంకిత‌భావంతో ప‌ని చేసే పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అలాగే ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి ఓటరు వివరాలు సరిగ్గా నమోదు అయ్యేలా చూడాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కీలకమని, అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తే రాబోయే రోజుల్లో పార్టీకి మరింత బలం చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
 

Back to Top