త్రిపురనేని చిట్టిబాబు అకాల మరణంపై వైయస్ జగన్ సంతాపం 

తాడేప‌ల్లి: ప్రముఖ సినీ నిర్మాత, విశ్లేషకుడు  త్రిపుర‌నేని చిట్టిబాబు అకాల మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌గాఢ సంతాపం వ్యక్తం చేశారు. చిట్టిబాబు గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. నిర్మాతగా, అనలిస్ట్‌గా తనదైన శైలిని ఏర్పరచుకున్న ఆయన, సినీ రంగంపై ఉన్న లోతైన అవగాహనతో పాటు విశ్లేషణాత్మక దృష్టి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేశారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.
 

Back to Top