తాడేపల్లి: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో మంచినీరు, మజ్జిగ అందించే ఏర్పాట్లు చేశారు. ఈ చలివేంద్రాన్ని మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిలా రఘురాం, ఎండి రుహుల్ల చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్యాలయానికి వచ్చే ఎవరికీ తాగునీటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి కాలం మొత్తం నిరంతరం మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేక అంజిరెడ్డి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, పంచాయతీరాజ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ ఫిరోజ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.