రైతులపై అక్రమ కేసులు బనాయించడం దారుణం

చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చిన అంబటి మురళి

గుంటూరు : రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేయించడం దారుణమని వైయ‌స్ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి మండిపడ్డారు. మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన ఘటనపై స్పందించిన ఆయన, రైతులకు అండగా నిలిచేందుకు “చలో మామిళ్లపల్లి” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబటి మురళి మాట్లాడుతూ.. మామిళ్లపల్లిలో తన ఇంటి పక్కనే సముద్రయ్య అనే రైతుకు చెందిన రేకుల షెడ్డు ఉందన్నారు. అయితే ఆ షెడ్డు, అందులో నిల్వ ఉంచిన మొక్కజొన్న పంట తనదేనంటూ ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులను పంపించి రైతులపై దాడులు చేయించారని, అనంతరం రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించారని విమర్శించారు. రైతులపై అక్రమంగా కేసులు బనాయించినందుకు ధూళిపాళ్ల నరేంద్రకు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అక్రమ కేసులు ఎదుర్కొంటున్న రైతులను పరామర్శించేందుకు “చలో మామిళ్లపల్లి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు.

Back to Top