ప్ర‌తీ కార్య‌క‌ర్త ఐడీ కార్డు వెరిఫికేషన్‌ను పూర్తి చేసుకోండి 

శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌

 శ్రీ సత్యసాయి జిల్లా: ప్ర‌తీ కార్య‌క‌ర్త ఐడీ కార్డు వెరిఫికేషన్‌ను పూర్తి చేసుకోవాల‌ని శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు ఉష‌శ్రీ చ‌ర‌ణ్ సూచించారు.  పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలో వైయ‌స్ఆర్‌సీపీ కేడర్ ఐడీ కార్డ్ వెరిఫికేషన్ ప్రక్రియపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శ్రీ‌సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌ పాల్గొన్నారు. పరిగి మండలంలోని పంచాయతీ కన్వీనర్లు, సోషల్ మీడియా కన్వీనర్లు, యువజన విభాగం అధ్యక్షులు, ఐటీ విభాగం అధ్యక్షులతో సమావేశమై ఐడీ కార్డ్ వెరిఫికేషన్ ప్రాధాన్యతపై వివరించారు. ప్రతి కార్యకర్త తప్పనిసరిగా తన ఐడీ కార్డు వెరిఫికేషన్‌ను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నాయకత్వం ఇచ్చిన సూచనల మేరకు పార్టీ బలోపేతానికి కేడర్ సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐడీ వెరిఫికేషన్ ద్వారా కేడర్ డేటా మరింత సమగ్రంగా ఉండటంతో పార్టీ కార్యక్రమాల అమలు సులభమవుతుందని తెలిపారు.

 వెరిఫికేషన్ కోసం లింక్: 
[https://myysrcp.com/verify](https://myysrcp.com/verify)

 గమనిక: QR కోడ్ కనిపిస్తేనే వెరిఫికేషన్ పూర్తయినట్లుగా పరిగణించాలి 
 

Back to Top