రైతులకు పప్పుశనగ విత్త‌నాలు పంపిణీ చేయాలి

ఉరవకొండ వ్యవసాయ ఏడీఏ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ ధర్నా 

అనంతపురం జిల్లా:  రైతుల‌కు వెంట‌నే రాయితీపై ప‌ప్పు శ‌నగ విత్త‌నాలు పంపిణీ చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ఉరవకొండ వ్యవసాయ ఏడీఏ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం నాయ‌కులు మాట్లాడుతూ … రబీ పంట కాలం ప్రారంభానికి ముందు వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని అయితే ప్రభుత్వ ఎప్పటి వరకు రాయితీతో పప్పుశ‌న‌గ విత్తనాలు సరఫరా ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో సరైంది కాదన్నారు. ఇబ్బందులు పడకముందు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు రైతు సేవ కేంద్రాలు విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.  

Back to Top