అప్పులపై కూటమి సర్కార్ తప్పుడు లెక్కలు

చేబదుళ్లపై ఆర్థిక మంత్రి విచిత్ర వాదన

ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపణ

హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

రాష్ట్ర అప్పులపై మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు

ఆధారాలతో ప్రశ్నిస్తున్నా ఎదురుదాడి

చేబదుళ్లు అప్పు కాదంటూ కొత్త వాదన

చేబదుళ్లకు సర్కార్ వడ్డీ కట్టడం లేదా ?

కేంద్రం పరిమితి దాటేసి మరీ అప్పులు

గతంలో ఏడాదికి 22.6 శాతం పెరిగిన అప్పు

మా హయాంలో 13.5 శాతం పెరిగితే గగ్గోలు

365 రోజుల్లో 8 రోజులు తప్ప రోజూ అప్పులే

కేంద్రం ఇచ్చే నిధులపైనా దుష్ప్రచారం

మా హయాం కంటే ప్రస్తుతం తగ్గిన నిధులు

15వ ఆర్ధిక సంఘం నిధులపైనా అబద్ధాలే

ఇచ్చే ప్రతీ పథకంలోనూ తప్పని కోతలు 

ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన మండిపాటు

హైదరాబాద్ :   రాష్ట్రంలో అప్పులపై కూటమి సర్కార్ మరోసారి అబద్ధాల ప్రచారం మొదలుపెట్టిందని ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆక్షేపించారు. కాగ్, ఆర్బీఐ డేటా ఆధారంగా మేం అడుగుతున్న లెక్కలకు సమాధానం చెప్పకుండా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. చేబదుళ్లు (వేస్ అండ్ మీన్స్) అప్పుల్లోకి రావంటూ  విచిత్ర వాదనల్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పడిపోతూ, ద్రవ్యలోటు పెరిగిపోతుంటే ప్రభుత్వం మాత్రం విపక్షం మీద బురదజల్లడంలో బిజీగా ఉందన్నారు. ఆర్ధిక మంత్రిని అడిగితే వైఎస్సార్సీపీ చెప్పేవన్నీ తప్పు అంటున్నారని, ఊరికే తప్పు అంటే సరిపోదు ఎక్కడ తప్పో కాగ్ నివేదిక ఆధారంగా చెప్పాలని బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు. 
ప్రెస్ మీట్ లో బుగ్గన రాజేంద్రనాథ్ ఇంకేమన్నారంటే..:

అప్పులపై మళ్ళీ అవే అబద్దాలు:
    2024-25లో మీరు చేసిన అప్పు  ఎంతని అడిగితే రూ.60,485 కోట్లు మాత్రమే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కాగ్ రిపోర్ట్ ప్రకారం రూ.81 వేల కోట్లకు పైగా అప్పు ఉందని అడిగితే, చేబదులు తీసుకున్నాం కాబట్టి మీకు అర్ధం కావట్లేదు అంటున్నారు. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేసి ఇచ్చిన పత్రంలోనే శ్వేతపత్రం ఆధారంగా చెప్తున్నాం అంటున్నారు. శ్వేతపత్రం అధికారిక పత్రం కాదు. చేబదులు అనేది ఆర్బీఐ వద్ద స్వల్పకాలికంగా తీసుకునే అప్పు. ఆర్ధిక సంవత్సరం చివరికి ఇందులో ఆర్బీఐకి కట్టాల్సింది కచ్చితంగా అప్పే అవుతుంది. మండలిలో మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మొత్తం రాష్ట్ర అప్పు 9 లక్షల 74 వేల కోట్లు ఉందని సమాధానం ఇచ్చారు. మేం అధికారం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పు 4,38,278 కోట్లు అని మీరే చెప్తున్నారు. మేం అధికారంలోకి వచ్చే నాటికి 2,57,509 కోట్లు అప్పు ఉంది. ఈ మొత్తం తీసేస్తే 1,80,769 కోట్లు మాత్రమే అప్పు ఉంది. ఇది కాక ప్రజా పద్దు 80,914 కోట్లు ఉంది. మేం అధికారంలోకి వచ్చే నాటికి మీ లెక్క ప్రకారమే 4,398 కోట్లు మాత్రమే అప్పుంది. మేం కార్పోరేషన్ అప్పు చూస్తే మేం దిగిపోయేనాటికి 2,48,677 కోట్లు ఉంటే, మేం అధికారంలోకి వచ్చే నాటికి 1,32,737 కోట్లు ఉంది. అది కూడా మేమే చేశామా చెప్పండి. ఇవన్నీ లెక్కిస్తే మేం చేసిన అప్పు 3 లక్షకు పైగా మాత్రమే ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శ్వేతపత్రం ఆధారంగా అని రాస్తున్నారు. ఇది చట్టపరంగా, న్యాయపరంగా తప్పు. 

చేబదుళ్లపై ఆర్థికమంత్రి విచిత్ర వాదన:
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ.3,31, 670 కోట్లు అప్పు చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాళ్లు చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు అంటే 2014-19 మధ్య ఏడాదికి 22.6 శాతం చొప్పున అప్పులు పెరిగితే , మా హయాంలో ఏడాదికి 13.5 శాతం మాత్రమే పెరిగింది. అంటే వాళ్లు 2014-19 మధ్య ప్రతీ 100 రూపాయలకు 22.63  పైసలు అప్పు చేశారు. మేం కోవిడ్ పెట్టుకుని కూడా ప్రతీ 100 రూపాయలకు 13.5 రూపాయలే చేశాం. దానికే శ్రీలంక అవుతుందని అన్యాయంగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆర్థికశాఖ మంత్రి చేబదులు తీసుకుంది అప్పుకాదంటున్నారు. అదే నిజమైతే ఖర్చుకూ, ఆదాయానికీ మధ్య 81,078 కోట్లు తేడా ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది. మీరు చెప్పే ప్రకారం 61 వేల కోట్లు మాత్రమే అప్పు చేస్తే మిగిలిన 20 వేల కోట్లు అప్పు కాకుండా ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. కాగ్ నివేదికలో చేబదుల్ని అప్పు కిందే రాసింది. మీ బడ్జెట్ పుస్తకంలో మాత్రం మీరు మాత్రం చేబదుల్ని అప్పు కిందే రాశారు. అయినా చేబదులు అప్పు కాదంటున్నారు. తాత్కాలిక అప్పు అయినా వడ్డీ కట్టాల్సిందే. 

మా అప్పులకూ, మీ అప్పులకూ తేడా ఇదే:
కాగ్ నివేదికలో నికర అప్పులు 81,082 కోట్లు ఉన్నాయి. కానీ మీకు కేంద్రం ఇచ్చిన పరిమితి 55,755 వేల కోట్లు మాత్రమే.  అంటే 15,062 కోట్లు ఎక్కువగా అప్పు చేశారు. స్థూల ఉత్పత్తిలో 3.5 శాతమే అప్పు చేశామని మరో అబద్ధం చెప్పారు. స్దూల ఉత్పత్తిలో 3 శాతం, సంస్కరణల కింద మరో 0.5 శాతం అప్పు చేసేందుకు వెసులుబాటు ఉంది. ఇక్కడ చూపించేది కేవలం 60,405 కోట్లు. మా ప్రకారం మీరు చేసిన గ్యారంటీలతో చేసిన అప్పు 89,026 కోట్లు. రాజధాని అమరావతి కోసం 47,837 కోట్లు. ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ బాండ్ల ద్వారా చేసిన అప్పు రూ.11,850 కోట్లు. 2025లో ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు రూ.81,082 కోట్లు. ఈ సంవత్సరం తొలి 10 నెలలకు చేసిన అప్పు 87,674 కోట్లు. ఆర్బీఐ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో తీసుకున్న అప్పు రూ. 9900 కోట్లు. ఈ మొత్తం కలిపితే రూ.3,27,370 కోట్లు. ఇతర కార్పోరేషన్ల ద్వారా చేసిన అప్పులు వీటికి అదనం. కాగ్ ప్రకారం 365 రోజుల్లో 8 రోజులు తప్ప ప్రతీ రోజూ అప్పు చేసారని తేలింది. మేం కోవిడ్ సమయంలో 2020-21లో 34 రోజులు మేం అప్పుల్లో లేము, 2021-22లో 43 రోజులు అప్పుల్లో లేం, 2022-23లో 24 రోజులు మేం అప్పుల్లో లేం, 2023-24లో మేం 31 రోజులు మేం అప్పుల్లో లేం. కానీ మీరు కేవలం 8 రోజులు మాత్రమే అప్పుల్లో లేరు. 

కేంద్రం సాయంలోనూ వెనుకబాటే:
2014-19 మధ్య మీరు ఇచ్చిన పరిమితి కంటే 29099 కోట్లు ఎక్కువ అప్పు చేసారు. దాన్ని మా హయాంలో కేంద్రం తగ్గించింది. మేం 13 శాతం వడ్డీకి అప్పు తీసుకున్నామని అబద్ధాలు చెప్తున్నారు. మీరు హయాంలో వడ్డీ రేట్లు చూస్తే 2018-19లో 6.69 శాతం, ఉంటే మా హయాంలో 2019-20లో 6.3 శాతం, 2020-21లో 6.13 శాతం, 2021-22లో 6.08 శాతం, 2022-23 6.3 శాతం, 2023-24 మధ్య 6.4 శాతమే వడ్డీ రేటు ఉంది.     మళ్లీ మీరు రాగానే వడ్డీ రేటు 6.2 శాతానికి వచ్చింది. కేంద్రం సాస్కీ ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే సాయం 2020-21లో దేశమంతా కలిపి 11,830 కోట్లు ఇస్తే.. అందులో మాకు 688 కోట్లు ఇచ్చారు. 2021-22లో దేశమంతా కలిసి 14185 కోట్లు ఇస్తే అందులో మాకు ఇచ్చింది 501 కోట్లు. 2022-23లో దేశమంతా కలిపి 87,795 కోట్లు ఇస్తే మా వాటా 6105 కోట్లు. 2023-24లో దేశమంతా కలిపి 1,09,554 కోట్లు ఇస్తే.. అందులో మా వాటా 4090 కోట్లు. ఇప్పుడు 1,49,483 కోట్లు దేశమంతా కలిపి ఇస్తుంటే అందులో 7900 కోట్లు ఇచ్చారు. కేంద్రం దేశమంతా ఇచ్చిన నిధుల్లో మా హయాంలో 2020-21లో 5.8 శాతం,  2021-22లో 3.5 శాతం, 2022-23లో 6.9 శాతం, 2023-24లో 3.7 శాతం తీసుకుంటే మీరు 5.2 శాతం మాకంటే తక్కువగా అందుకున్నారన్నది నిజం. 
    15వ ఆర్ధిక సంఘం ఇచ్చిన నిధుల్లో 30 వేల కోట్లు ఇస్తే దాన్ని ముందే వాడుకున్నారని ప్రభుత్వం మరో అబద్ధం చెబుతోంది. కానీ 2021-22 సంవత్సరానికి రూ.17,257 కోట్లు,  2022-23లో రూ.10,549 కోట్లు, 2023-24లో రూ.2691 కోట్లు మాత్రమే నిధులు వచ్చాయి. కానీ 2024-26 మధ్య ఏమీ రాలేదు. రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చే నాటికి పబ్లిక్ అకౌంట్ రూ.19138 కోట్లు ఉంటే దాన్ని రూ.76516 కోట్లకు మీరు పెంచారు. మేం దిగిపోయే నాటికి అది రూ.76038 కోట్లే ఉంది. అంటే మీరు 57378 కోట్లు ప్రజా పద్దు డబ్బులు కూడా మీరు వాడేశారు. దాన్ని మేం తిరిగి కట్టాం. బడ్జెట్ వివరాలు కూడా రాష్ట్ర ప్రజలకు అర్దం కాని పరిస్ధితి. అంతా గ్రాఫ్ లతో నింపేశారు. మా హయాంలో ఇచ్చిన బడ్జెట్ లో విశ్లేషణలు ఉండేవి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక విపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారు. 

ఇచ్చే ప్రతీ పథకంలోనూ కోతలే:
     రేషన్ కార్డుదారులు కోటీ 42 లక్షల మంది ఉన్నారు. 855 గ్యాస్ సిలెండర్ లెక్కన మూడేళ్లలో వారికి ఇవ్వాల్సి ఉండగా.. మొదటి సంవత్సరం ఏమీ ఇవ్వలేదు. గతేడాది 1790 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 1299 కోట్లు కేటాయించారు. మీ కేటాయింపుల ప్రకారం 90 లక్షల మందికి మాత్రమే ఇవ్వగలరు. మిగిలిన వారికి ఇవ్వలేదు. తల్లికి వందనం కూడా 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. వీరికి రూ.13,112 కోట్లు అవసరం. కానీ మీరు కేటాయించింది 8456 కోట్లు మాత్రమే. మీరే 60 లక్షల మందికి ఇచ్చామని చెప్తున్నారు. మిగిలిన 27 లక్షల మందికి ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలి. పింఛన్లు కూడా దాదాపు 20 లక్షల మందికి పైగా ఇవ్వాలి. కానీ ఇవ్వకపోగా.. పాత పెన్షన్షలో 5-6 లక్షలు కోత పెడుతున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 చొప్పున కోటీ 79 లక్షల మందికి ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ ఇవ్వట్లేదు. 2014-19 మధ్య రైతులకు మీరు 3,323 కోట్లు పంటల సేకరణకు ఖర్చుపెట్టారు. 2019-24 మధ్య మేం 7746 వేల కోట్లు ఖర్చు పెట్టాం. 2023-24 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 9.6 శాతం దేశ ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం 1.9 శాతం పెరిగింది. అంటే దేశంలో 22వ స్ధానంలో ఉన్నారు. దక్షిణాదిలో తమిళనాడు 9.1 శాతం, తెలంగాణ 4.7 శాతం, కేరళ 7.5 శాతం, కర్నాటక 9.1 శాతం ఆదాయం పెరిగింది. 2023-24 డిసెంబర్ వరకూ లెక్కిస్తే ఆదాయం 60893 కోట్లు ఉంటే రెండేళ్ల తర్వాత మీ ఆదాయం 63316 కోట్లు మాత్రమే ఉంది. రెవెన్యూ లోటు 38622 కోట్లు ఉంటే మీది 60285 కోట్లు. దేశ చరిత్రలో ఇదే అత్యధికం. ద్రవ్యలోటు కూడా మాది రూ.62719 కోట్లయితే మీది 81,071 కోట్లు ఉంది. మా హయాం కంటే మీ హయాంలో రెవెన్యూ లోటు 56 శాతం పెంచారు. ద్రవ్యలోటు 30 శాతం పెంచారు. అయినా మాకు పాలన చేతకాలేదని దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారని బుగ్గన రాజేందనాథ్ ఆక్షేపించారు.

Back to Top