బీఆర్‌ నాయుడుకు సీఎం చంద్రబాబు అండదండలు

సీఎం తిరుమల పర్యటనలో వ్యవహారం బట్టబయలు

మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌.

చంద్రబాబు భరోసాతోనే బీఆర్‌ నాయుడి బరితెగింపు

లైంగిక వేధింపులతో అడ్డంగా దొరికినా బుకాయింపు

తేల్చి చెప్పిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌

బీఆర్‌ నాయుడిని చంద్రబాబు దూరం పెట్టడం అబద్ధం

హిందూ ధర్మ పరిరక్షణపై చంద్రబాబు, పవన్‌కు చిత్తశుద్ది లేదు 

అందుకే బీఆర్‌ నాయుడిని ఇంకా పదవిలో కొనసాగిస్తున్నారు 

ఇదే అదనుగా బీఆర్‌ నాయుడు మరింత రెచ్చిపోతున్నాడు 

బీఆర్‌ నాయుడు హయాంలో టీటీడీలో వరసగా అపచారాలు

టీటీడీ ఛైర్మన్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌

తాడేపల్లి: తిరుమల పర్యటనలో బీఆర్‌ నాయుడిని వెంటేసుకుని తిరిగిన సీఎం చంద్రబాబు, ఆయన చేసే అపచారాలు, దారుణాలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్టే అవుతుందని శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ నాయుడు స్త్రీలోలుడని తెలిసినా, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని ఆలయ ప్రతిష్టను కాపాడతానని చంద్రబాబు చెబితే భక్తులు ఎలా నమ్ముతారని ఆమె ప్రశ్నించారు. బీఆర్‌ నాయుడిని పక్కన పెట్టినట్టు, ఆయనపై చంద్రబాబు కోపంగా ఉన్నట్టు ఎల్లో మీడియాలో ఇన్నాళ్లూ ప్రచారం చేసుకున్నా, చంద్రబాబు తిరుమల పర్యటనతో అదంతా అబద్ధమేనని తేలిపోయిందని చెప్పారు. చంద్రబాబుకి స్వాగతం పలకడం దగ్గర నుంచి అడుగడుగునా బీఆర్‌ నాయుడు ఆయన వెన్నంటే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అలా ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టే బీఆర్‌ నాయుడు మరింత బరితెగించి మాట్లాడుతున్నాడని అన్నారు. తిరుమల పవిత్రతపై సీఎం, డిప్యూటీ సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీఆర్‌ నాయుడితో టీటీడీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఉషశ్రీ చరణ్‌ తేల్చి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

బరితెగించిన బీఆర్‌ నాయుడు:
    బీఆర్‌ నాయుడు టీటీడీ ఛైర్మన్‌ అయినప్పటి నుంచి తిరుమల వేదికగా జరుగుతున్న అపచారాలు చూసినప్పుడైనా ఆయనతో రాజీనామా చేయించాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా బీఆర్‌ నాయుడి అశ్లీల వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన్ను కాపాడటం హేయం. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానని ఆలయ మెట్లు కడిగిన పవన్‌ కళ్యాణ్, బీఆర్‌ నాయుడు చేసిన పనులకు ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ వెనకేసుకొస్తున్నారు కాబట్టే బీఆర్‌ నాయుడు అతి పవిత్ర గ్రంథం భగవద్గీత గురించి కూడా బరితెగించి మాట్లాడుతున్నాడు. పైగా పదవిని వీడబోనంటూ ఎదురుదాడి కూడా చేస్తున్నాడు.

స్త్రీలోలుడని తెలిసినా పదవి ఇచ్చారు:
    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల వేదికగా జరుగుతున్న ఘోరాలు చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఇది చాలదన్నట్టు బీఆర్‌ నాయుడు వ్యవహారం గుర్తుకు తెచ్చుకుని శ్రీవారి భక్తులు ఒళ్లు గగుర్బాటుకు గురవుతున్నారు. అశ్లీల వీడియోలతో బీఆర్‌ నాయుడు అడ్డంగా దొరికిపోయినా సీఎం చంద్రబాబు ఆయనపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణం. అత్యంత పవిత్రమైన టీటీడీ ఛైర్మన్‌గా స్త్రీలోలుడైన బీఆర్‌ నాయుడిని తెచ్చి పెట్టడం దుర్మార్గం. ఆయన మీద బ్రాహ్మణ కులానికి చెందిన ఒక మహిళ, 2024 ఎన్నికల ముందే నాటి విపక్షనేత చంద్రబాబుతో పాటు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, నారా లోకేష్‌కు లేఖ రాసింది. తనను బీఆర్‌ నాయుడు లైంగికంగా ఎలా వేధించాడో ఆ లేఖలో తెలియజేసింది. ఇంకా బీఆర్‌ నాయుడు తన జీవితాన్ని ఎలా నాశనం చేశాడో కూడా వివరించింది. అయినా పట్టించుకోకుండా, దేవుడంటే ఏ మాత్రం భయం, భక్తి లేని బీఆర్‌ నాయుడిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించారు. 

అప్పటి నుంచి తిరుమలలో అపచారాలు:
    బీఆర్‌ నాయుడు టీటీడీ ఛైర్మన్‌ అయిన నాటి నుంచి అపచారాలు మొదలయ్యాయి. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మద్యం సీసాలు కనిపించాయి. బిర్యానీలు తింటూ కనిపించారు. తిరుమలలో రీల్స్‌ చేస్తున్నారు. ఒక సైకో తిరుపతిలో ఆలయ గోపురం ఎక్కి హల్చల్‌ చేశాడు. చివరకు తాగుబోతులకు అడ్డాగా తిరుమల మారిపోయింది. చెప్పులేసుకుని దర్శనాలకు వస్తున్నారు. తిరుమలలో నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వరుస ఘటనలు భక్తులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. చివరకు తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారు. టీటీడీ చరిత్రలో తొలిసారి అలా జరిగింది. ఆ సందర్భంగా బీఆర్‌ నాయుడు బాధ్యత లేకుండా సమాధానం చెప్పాడు.
    ఇంకా ఇటీవల భగవద్గీత గురించి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అయినా ఆయన్ను చంద్రబాబు ఏనాడూ మందలించ లేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తన మాటలపై బీఆర్‌ నాయుడు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌కి తిరుమలలో జరిగే దారుణాలు కనిపించకపోవడం హాస్యాస్పదం.

తిరుమలలో చంద్రబాబు వెన్నంటే బీఆర్‌ నాయుడు:
    బీఆర్‌ నాయుడి రాసలీలల వీడియో వెలుగులోకి వచ్చి నెలరోజులు దాటినా సీఎం చంద్రబాబు ఆయనతో రాజీనామా చేయించలేదు. ఆలయ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్టు, ఆయనపై ఫైర్‌ అయినట్టు ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు. కానీ అదంతా ఉత్తుదేనని చంద్రబాబు మనువడు దేవాన్‌‡్ష పుట్టినరోజు వేడుకల సందర్భంగా తేలిపోయింది. మనువడి పుట్టినరోజు వేడుకల కోసం తిరుమలకు వచ్చిన చంద్రబాబుకి స్వాగతం పలికన దగ్గర నుంచి అడుగడుగునా ఆయన వెన్నంటే బీఆర్‌ నాయుడు అనుసరించాడు. భువనేశ్వరి గారు అన్నదానం చేస్తున్న సందర్భంలోనూ బీఆర్‌ నాయుడు అక్కడే ఉన్నాడు. 

బీఆర్‌ నాయుడితో తక్షణం రాజీనామా చేయించాలి:
    బీఆర్‌ నాయుడి వ్యవహారంపై తిరుపతి సహా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఆందోళన చేస్తున్నారు. ఆయన్ను టీటీడీ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని అంతా డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు భక్తుల మనోభావాలు, తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటిౖMðనా బీఆర్‌ నాయుడితో రాజీనామా చేయించాలని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌ కోరారు.

Back to Top