రాధాకృష్ణా.. నీవి పత్రికా రాతలా? పచ్చి అరాచకాలా?

మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే వత్తాసు పలుకుతారా?

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 

రాధాకృష్ణా నీది ‘పత్రికా స్వేచ్ఛ’కాదు

పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఆంధ్రజ్యోతి రాక్షస రాతలు

ఆంధ్రజ్యోతి నీచపు రాతలకు వత్తాసు పలుకుతారా?

కూటమి నేతలపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 

మీ ఇంటికి వస్తే ఒక నీతి.. పక్కింటికి వస్తే మరో నీతా? .

వైయ‌స్ఆర్‌సీపీ  నేతల భార్యలను కించపరిస్తే.. ముఖ్యమంత్రి మద్దతా?

పవన్ కళ్యాణ్ గారూ.. నాడు మీరు ఇదే ఆంధ్రజ్యోతి వద్ద ధర్నా చేయలేదా?

శాంతియుత నిరసన చేస్తే ‘రౌడీ మూకలు’ అంటారా? 

మండిపడ్డ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 

తన అసభ్యకర వ్యాఖ్యలకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి.

భార్యకు, సోదరికి తేడా తెలియని భాషతో పత్రికా అరాచకమా?

బొత్స తీవ్ర ఆక్షేపణ

‘మావిగన్’ అభివృద్ధిపై సమాధానం చెప్పలేని ప్రభుత్వం

ప్రతిగా వైయ‌స్ఆర్‌సీపీ నేతల కుటుంబాలపై వ్యక్తిగత దాడులా?

నాడు సనాతన ధర్మం అని చెప్పిన కూటమి నేతలు

మహిళల అవమానాన్ని ఎలా సమర్థిస్తారు?

అబద్ధపు రాతలకు కొమ్ముకాస్తున్న లోకేష్ సహా కూటమి నేతలు

మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

స్పష్టం చేసిన బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: పత్రికా స్వేచ్ఛ పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైయ‌స్ఆర్‌సీపీ నేతల కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేయలేక నేతల భార్యలను, కించపరిచేలా ‘వీకెండ్ కామెంట్స్’ రాయడం జుగుప్సాకరమని ధ్వజమెత్తారు. ఈ నీచపు రాతలకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను ‘రౌడీ మూకలు’ అని సంబోధిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు రాధాకృష్ణ అరాచకానికి మద్దతు తెలపడం సిగ్గుచేటని విమర్శించారు. ‘మీ ఇంటి వరకు వస్తే ఒక నీతి.. పక్కింటికి వస్తే మరో నీతా?’ అని ప్రశ్నిస్తూ, గతంలో ఇదే ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవైపు అమరావతిలో జరుగుతున్న అంతులేని దోపిడీ మరోవైపు విశాఖలో రూ.5 వేల కోట్ల భూదోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని, రాధాకృష్ణ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు."  ఇందుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... 

- కుటుంబాలపై దాడులా? ఇదేనా మీ సంస్కృతి?

రాజధానిపై జగన్ గారు చేసిన 'మావిగన్' ప్రతిపాదనకు సమాధానం చెప్పలేక, ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ నేతల భార్యలను, సోదరీమణులను కించపరిచేలా మాట్లాడటం నీచానికి పరాకాష్ఠ. "భార్యకు, సోదరికి మధ్య తేడా తెలియని భాషతో రాధాకృష్ణ అరాచకం సృష్టిస్తుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి,  శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైసీపీ నేతలను రౌడీలని ప్రస్తావించడం శోచనీయం". 

- మీ ఇంటి వరకు వస్తే ఒక నీతి.. పక్కింటికి వస్తే మరో నీతా?..

గతంలో తమ కుటుంబ సభ్యులపై చిన్న మాట వస్తే హంగామా చేసిన కూటమి నేతలు, ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ నేతల కుటుంబాలను రోడ్డుకు ఈడుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు. "మీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో తన కోసం ఇదే ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ధర్నా చేయలేదా? నాడు మీరు చేస్తే ప్రజాస్వామ్యం.. నేడు మా నేతలు, మాజీ మంత్రులు శాంతియుతంగా ధర్నా చేస్తే దాన్ని రౌడీ మూకల దాడి అని ముద్ర వేస్తారా?". పత్రికా స్వేచ్ఛ అంటే మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనా?.

- అమరావతి పేరుతో భారీ దోపిడీ – డైవర్షన్ పాలిటిక్స్..

వైయ‌స్ఆర్‌సీపీ అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. చదరపు అడుగుకు రూ. 14 వేల ఖర్చు చూపిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. అమరావతికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఆ పేరుతో చేస్తున్న అధికార పార్టీ దోపిడీకి మాత్రమే మా పార్టీ వ్యతిరేకం. అమరావతిలో నిర్మాణాలు త్వరిత గతిన చేపట్టాలనే మేం కోరుతున్నాం. కానీ వాస్తవానికి అవేవీ జరగడం లేదు. రాజధానిలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కుమ్మక్కై చేస్తున్న చర్యలని ప్రజలు అనుమానిస్తున్నారు.  విశాఖపట్నంలో చంద్రబాబు కుటుంబ సభ్యులే రూ. 5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోపిడీ చేస్తున్నారని, దీనిపై సమాధానం చెప్పలేకే ఇలాంటి నీచపు రాతలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

- వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ‘షో పాలిటిక్స్’..

రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర లేక, రోగులు ఆరోగ్యశ్రీ అందక ఇబ్బంది పడుతుంటే.. వ్యవసాయ, ఆరోగ్య శాఖల మంత్రులు ఆ సమస్యలను గాలికొదిలేసి వైయ‌స్ఆర్‌సీపీ ధర్నాపై స్టేట్‌మెంట్లు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం రూ. 3.30 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిందో సమాధానం  చెప్పాలి. విద్యా, వైద్య రంగాలు కుదేలవుతుంటే వాటిపై ట్వీట్లు చేయని ముఖ్యమంత్రి, ఒక పత్రికాధినేత చెత్త రాతలకు మద్దతుగా మాట్లాడటం దౌర్భాగ్యం. 

- క్షమాపణ చెప్పాల్సిందే..

కూటమి ప్రభుత్వం  తాటాకు చప్పుళ్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బెదరదు. 40 శాతం ఓటు షేర్ ఉన్న పార్టీపై బుల్డోజింగ్ పాలిటిక్స్ సాగవు. రాధాకృష్ణ తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. సనాతన ధర్మం అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎలా సమర్థిస్తారో సమాధానం చెప్పాలి" అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...

తక్షణమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. మరోసారి ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇవ్వడంతో పాటు తన వ్యాఖ్యలపై  క్షమాపణ చెప్పాలి. భార్యను, సోదరిని ఒకే గాటన కట్టేలా చేసిన వ్యాఖ్యలను సనాతన ధర్మం అని చెప్పుకునే మంత్రులు ఏ రకంగా వీటిని సమర్థిస్తారు. విమర్శించే మందు కొద్దిగా ఆలోచించుకోవాలి. లేదంటే వడ్డీ తో సహా మూల్యం చెల్లించుకోక తప్పుదు. ఈ నేపధ్యంలో రేపు వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు, జిల్లా కేంద్రాల వద్ద ఏబీయన్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలకు నిరసనగా ఆ సంస్థ కార్యాలయాల మందు శాంతియత నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ ఘనత తమ వల్లేనని క్రెడిట్ చోరీ చేస్తున్న కూటమి నేతలు.. అసలు విశాఖ నుంచి ఎయిర్ పోర్టుకు దారి గురించి ఎందుకు మాట్లాడడం లేదని బొత్స సత్యనారాయణ నిలదీశారు.

Back to Top