వ‌చ్చే సంవ‌త్స‌రం పాద‌యాత్ర‌

నా పాదయాత్రలో చంద్ర‌బాబుకి రోజుకో సినిమా

తాడేప‌ల్లిగూడెం పార్టీ నేత‌ల స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

తాడేప‌ల్లి:  వ‌చ్చే ఏడాది నుంచి పాద‌యాత్ర మొద‌ల‌వుతుంద‌ని, ఆ త‌రువాత చంద్ర‌బాబుకు రోజుకో సినిమా చూపిస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో తాడేప‌ల్లిగూడెం పార్టీ నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

కూటమి పాలనకు సగం టర్మ్ అయిపోయింది. మిగిలింది ఒక సగం టర్మ్ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నేను కూడా రోడ్డుమీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం.

చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌తో రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేస్తున్నారు
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మావిగన్. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి మీ తీరుతో క్యాపిటల్ అనేది ఉండదు. ఇది మానుకోండి. అమరావతి అని మీరు రైతులను మోసం చేస్తున్నారు. అమరావతి అని ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికే నీ అంతట నువ్వే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్‌కు, బ్యాంకులకు డీపీఆర్‌లు ఇచ్చావు. ఈ లెక్కన 50 వేల ఎకరాలకే లక్ష కోట్లకు దిక్కులేదు అనుకుంటే… మరో 50 వేల ఎకరాలు అని చెప్పి మళ్లీ భూ సమీకరణ చేపడుతూ… లక్ష ఎకరాల అమరావతి అని చెబుతున్నావు. ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేస్తూనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్లు అయిపోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే, కరెంట్, నీళ్లకే ఖర్చు అవుతుంది. ఆ రెండు లక్షల కోట్ల విలువ దశాబ్దాలకు రూ.4 లక్షల కోట్లు అవుతుందో, ఇంకా ఎంత అవుతుందో తెలియదు. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయ్యా చంద్రబాబు ఇది మానుకో. ఆ రెండు లక్షల కోట్లలో 10 శాతం ఖర్చు చేస్తే చాలు.

ప్లాన్-ఏ వ‌ద్ద‌న్నారు..ప్లాన్‌-బీపై ఎందుకు ఆలోచ‌న చేయ‌డం లేదు?
నేను ఇంతకు ముందు రాజధాని విషయంలో మంచి ఆలోచన చెప్పాను. ప్లాన్–ఏ కింద రాష్ట్రంలో అన్నింటి కన్నా పెద్ద నగరం విశాఖపట్నం… అందులో కార్యనిర్వాహక రాజధాని పెడితే ఎలాంటి ఖర్చు అవసరం ఉండదు. శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం అప్పట్లో మనం కర్నూలుకు మాటిచ్చాం, అది నెరవేర్చుతూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ… ఇక్కడే అమరావతిలో శాసన రాజధాని తీసుకువస్తే బాగుంటుందయ్యా అని చెబితే నానాయాగీ చేసి, రాజకీయాలు చేసి అవి వద్దు అన్నారు. సరే పోనీ అది వద్దు. కనీసం ఈ ప్రాంతంలోనైనా నీవు చేసే పనికి రాజధానినే లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయమని ప్లాన్–బీ కింద మావిగన్ ప్రతిపాదన తెచ్చాం.

10 శాతం ఖ‌ర్చు చేస్తే ఇక్క‌డే బ్ర‌హ్మాండ‌మైన రాజ‌ధాని
మచిలీపట్నంలో పోర్టు కట్టింది నీవు కాదు చంద్రబాబు, మేం కట్టాం. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పోర్టుకు భూసేకరణ చేపట్టాం. మన హయాంలోనే అనుమతులు తీసుకువచ్చాం. మన హయాంలోనే ఫైనాన్షియల్ క్లోజర్ చేశాం. అప్పట్లోనే బ్యాంకులతో నీట్‌గా టైఅప్ చేసి వర్క్ 30–40 శాతం కూడా పూర్తి చేశాం. ఆ పోర్టు పూర్తవుతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉంది. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉంది. మచిలీపట్నంలో పోర్టు వస్తుంది. ఈ హైవేకు అటుఇటుగా అమరావతిలో కట్టే బిల్డింగ్‌లు ఇక్కడ కడితే బాగుంటుంది. మచిలీపట్నం నుంచి (మా), విజయవాడ నుంచి (వీ), గుంటూరు నుంచి (గన్) అంటూ మావిగన్ ప్రతిపాదన చేశాం. ఈ 110 కిలోమీటర్ల ఎకనామిక్ కారిడార్‌ను క్యాపిటల్ కారిడార్‌గా డిక్లేర్ చేసి, ఆ కట్టే బిల్డింగ్‌లు ఇక్కడ కట్టండి. రెండు లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ ఖర్చు చేసి రోడ్లకు కనెక్టివిటీ ఇస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారు అవుతుంది. డే వన్ నుంచే రాజధాని వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ల తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మావిగన్‌లోనే ఉద్యోగాలు దొరుకుతాయి అని చిలుకకు చెప్పినట్లు చెప్పినా, చంద్రబాబు ఒప్పుకోవడం లేదు.

జ‌గ‌న్ ఏం చెప్పినా ఆహా అంటున్నారు..
మనమంతా బాగా, లౌక్యంగా చెప్పినా గానీ ఆహా అంటున్నాడు. ఎందుకు అహా… ఎందుకు వద్దు… కారణం అక్కడ రెండు లక్షల కోట్లలో మొబిలైజేషన్ వర్కుల పేరుతో 8 శాతం కమిషన్లు తీసుకోవచ్చు. మావిగన్‌లో ఈ ఆదాయాలు ఉండవు కదా. కాబట్టి మావిగన్ వద్దు. అమరావతిలో కాంట్రాక్టర్లు ఎవరు అంటే ఒకడు ఈనాడు రామోజీరావు వియ్యంకుడు రఘు (ఆర్‌జీవీ), ఇంకొకరు బీఎస్‌ఆర్ (బల్క్ శ్రీనివాసరావు). వీరు చంద్రబాబు బినామీలు. అమరావతి కాంట్రాక్టర్లు అంతా వీళ్లే. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకనే మావిగన్ అంటే ఆహా… వైయస్ జగన్ ఏం చెప్పినా ఆహా అంటున్నారు.
 

Back to Top