తాడేపల్లిగూడెం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమంలో భాగంగా 22వ వార్డు ఇంచార్జి, మహిళా నాయకురాలు మందా పద్మావతి నివాసంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ తాడేపల్లిగూడెం ఇంచార్జ్ వడ్డే రఘురామ్ నాయుడు హాజరై క్యాడర్‌తో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి చర్చిస్తూ స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ గొర్రెల శ్రీనివాస్‌తో పాటు వార్డు ఇంచార్జులు కలిశెట్టి తాతారావు, బూడి దుర్గా ప్రసాద్, రాజా త్రినాద్, వెలనాటి సత్తిబాబు, తానేటి అజయ్, పాలూరి దొరబాబు, పట్నాల గణపతి, వట్టి బుజ్జి, ద్వారంపూడి ప్రేమ్ కిరణ్ రెడ్డి, పెంటపాటి సత్తిబాబు, బండి నర్సింహారావు, జగన్నాధం ఏసు, నారాయణం రాంబాబు, అశోక్ దొర, అజయ్, వెంకటేశ్వరావు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.