జస్టిస్ లీసా గిల్‌కు వైయ‌స్ జగన్‌ శుభాకాంక్షలు 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన  పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు.

 
 

Back to Top