పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేయాలి 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులైన మెట్టుపల్లె ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి అభినందించారు. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో ఇటీవ‌ల రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వి పొందిన మెట్టుప‌ల్లె ప్ర‌భాక‌ర్‌రెడ్డి శ‌నివారం రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.   ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని, నాయకత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.
 

Back to Top