డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో వైయస్ఆర్‌సీపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పోలీస్ అడిషనల్ సూపరింటెండెంట్ (ఏఎస్పీ)కు మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్, రామచంద్రాపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అని పేర్కొన్నారు. గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, చట్టం తన పని తాను చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, నాగిరెడ్డి, జెడ్పీటీసీ పందిరి శ్రీహరి, గొల్లపల్లి డేవిడ్, సంసాని నాని, అమలాపురం పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య, ఇళ్ల శేషారావు, చొల్లంగి సుబ్బురాం తదితరులు పాల్గొన్నారు.