అనంతపురం జిల్లా: శింగనమల మండలం శింగనమల పంచాయతీలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని వారికి భరోసా కల్పించారు. ప్రతి కార్యకర్త ఐక్యంగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన ఆయన, రాబోయే రోజుల్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరంధామ రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు బెస్త గోపాల్, వడ్డే మల్లి, పర్వతయ్య, మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా, ఆటో దావూద్, అలీ చింటూ రాయల్, బెస్త ప్రసాద్, సాయినాథ్, మసూద్ వలి, కులశేఖర్, నవీన్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.