డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: వైయస్ఆర్‌సీపీ పి.గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వైయస్ఆర్‌సీపీ నేతలు అంబాజీపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నేతృత్వంలో స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వైసీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామంలో వైయస్ఆర్‌సీపీ నేతకు చెందిన షెడ్‌ను అధికారులు కూల్చివేయడాన్ని తప్పుపట్టారు. రాజకీయ కక్షతో చేసిన చర్యేనని మండిపడ్డారు. ఈ ఘటనలపై న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు.