డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

తప్పు చేసి తిరిగి పోలీసులు లక్ష్యంగా కాల్పులు

కూటమి నేతల గూండా రాజ్యానికి నిదర్శనమిది 

మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం. 

రాజమండ్రి లోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్.

చట్టసభల గౌరవాన్ని మంటగలిపిన టీడీపీ ఎంపీ

పుట్టా మహేష్ యాదవ్‌తో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి 

డ్రగ్స్ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలి

వెనుకున్న అసలు సూత్రధారులను అరెస్టు చేయాలి

మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ 

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజమండ్రిలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడి తీరుపై ధ్వజమెత్తారు. "సాక్షాత్తూ లోక్ సభ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలతో కలిసి రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కడం రాష్ట్రానికే అవమానకరం అని మండిపడ్డారు. బయట డ్రగ్స్ నిర్మూలన గురించి ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు, లోపల ఇలాంటి డ్రగ్స్ బానిసలను చట్టసభల్లో కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు. పట్టుబడిన తర్వాత కూడా పోలీసుల (ఈగిల్ టీం) పైనే కాల్పులు జరపడం గుండా రాజ్యానికి నిదర్శమని ఆగ్రహించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

- వెనకేసుకురావడం సిగ్గుచేటు...

డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. ఇంత దారుణంగా అధికార పార్టీ ఎంపీ ఇలా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినా ఇంకా తెలుగుదేశం పార్టీ స్పందించకపోవడం దారుణం. తక్షణమే ఆయన్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలి. ఆయనతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు? డ్రగ్స్ నిర్మూలించాలని బయట ప్రచారాలు చేస్తూ.. లోపల మాత్రం అవే డ్రగ్స్ తీసుకుంటూ పట్టు బడటం సిగ్గు చేటు.  

- డ్రగ్స్ మాఫియా మూలాలు వెలికి తీయాలి.

ఈ వ్యవహారంలో పోలీసులు ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లకి లొంగవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ డ్రగ్స్ నెట్ వర్క్ ను ఎవరు రక్షిస్తున్నారు? ఈ మాఫియాను ఎవరు కంట్రోల్ చేస్తున్నారన్న విషయంపై దృష్టి సారించి.. వాస్తవాలను ప్రజల ముందుంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డితో,  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి గారెకి హాట్ లైన్ సంబంధాలున్నాయి. రేవంత్ రెడ్డి సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా తనకు చంద్రబాబుతో ఉన్న సన్నిహత సంబందాల వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలుపు చేయించానని ప్రకటించారు. అంత బహిరంగంగా రేవంత్ రెడ్డి ప్రకటన చేసినా కూడా చంద్రబాబు, మంత్రులందరూ నీళ్లు నమిలారే తప్ప ఆయన చెప్పిన మాటలను కాదనే సాహసం చేయలేదు. కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబుకి హాట్ లైన్ సంబంధాలున్నయి. 

- పోలీసులపైనే కాల్పులు - ఇది గుండా రాజ్యమే...

మరోవైపు తమ ఎంపీ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడితే దానికి పార్టీకి సంబంధం లేదని.. అది అతని వ్యక్తిగత వ్యవహారం అని తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీ పార్టీ ఎంపీతో ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కాలేజీలతో పాటు అనేకచోట్ల డ్రగ్స్ నెట్ వర్క్ విపరీతంగా విస్తరిస్తోంది. దీన్ని సమాజం నుంచి పారద్రోలాల్సిన అవసరం ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో ఎప్పటికప్పుడు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి, కఠిన చర్యలు తీసుకున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం పూర్తిగా డ్రగ్స్, గంజాయి, మద్యాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. 

- అసలు సూత్రధారులను అరెస్టు చేయాలి...

చంద్రబాబు పాలనలో ఏపీలో మద్యం అక్రమ అమ్మకాలు, అధికార పార్ట ఎమ్మెల్యేలకే నేరుగా ముడుపులు అందుతున్న దుస్థితి. పుట్టా మహేష్ డ్రగ్స్ దందాలో ఒక పాపు మాత్రమే. అతని వెనుక చాలా పెద్ద నెట్ వర్క్ ఉంది. అదంతా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఏకంగా ఎంపీ డ్రగ్స్ తీసుకోవడంతో పాటు పోలీసులనే బెదిస్తూ... తుపాకీతో కాల్పులు జరపారంటే... ఇది కచ్చితంగా గుండా రాజ్యమే. తమ ఎంపీని రక్షించడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేసుంటాడు.. కానీ మీడియాలో విషయం బయటపడ్డంతో పుట్టా మహేష్ ఉదంతం బయటపడింది. 
చంద్రబాబు తక్షణమే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ. పుట్టా మహేష్ తో ఎంపీ పదవికి రాజీనామా చేయించడంతో పాటు, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మాజీ ఎంపీ  మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎంపీలు చేసి, చట్టసభల్లో కూర్చొబెట్టినందుకు కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. ప్రజలు కూడా ఎవరు ఉత్తములు, ఎవరు దుర్మార్గులన్న వాస్తవాలు గ్రహిస్తున్నారని మార్గాని భరత్ తేల్చి చెప్పారు.

Back to Top