వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు ఆత్మీయ సత్కారం  

విశాఖపట్నం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు "ఆత్మీయ సత్కారం" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. కె. రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ హాజరై కార్పొరేటర్లను సత్కరించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తైనాల విజయకుమార్, మాజీ మేయర్ హరివెంకటకుమారి, నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top