కాకినాడ: రాష్ట్రంలో ఎవరు మంచి చేసినా అది నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాటిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత మండిపడ్డారు. కాకినాడలో కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో కాకినాడ సెజ్ భూములపై మీడియాతో మాట్లాడుతూ... తాను చేయని పనులను కూడా తన ఖాతాలోనే వేసుకుంటూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2014-19 మధ్య కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా.. దేశంలోనే అత్యంత విప్లవాత్మక సంస్కరణలను చేపట్టిన ఘనత వైయస్.జగన్ దేనని తేల్చి చెప్పారు. కాకినాడ్ సెజ్ భూములను రైతుల వెనక్కి ఇస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని.. అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబరు 158 ద్వారా నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. అదే జీవోను అమలు చేయడానికి కేవలం మెమో మాత్రమే జారీ చేసిన కూటమి ప్రభుత్వం... ఆ ఘనతను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఇంకా అక్కడక్కడా రైతులపై ఉన్న కేసులను వెనక్కి తీసుకోవడంతో పాటు వైయస్.జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్థానికులకు ఉద్యోగాల్లో 75 శాతం కోటా ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే... ● కురసాల కన్నబాబు, మాజీ మంత్రి. దురదృష్ఠవశాత్తూ చంద్రబాబుకు గతం మర్చిపోయే లక్షణం ఉంది. అన్నీ తానే చేశానని ఆయన నమ్మి.. ఎల్లో మీడియాతో ప్రజలను నమ్మించే కార్యక్రమం చేస్తుంటారు. దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. వైయస్.జగన్ చేసిన మంచి కార్యక్రమాల క్రెడిట్ ను చోరీ చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. అంతే తప్ప తనకంటూ ఒక ప్రత్యేక ముద్రవేసుకునేలా, పదిమందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్న సామెతలా చంద్రబాబును మించి ఆయన తనయుడు లోకేష్ తండ్రి కంటే పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు. నిజం చెప్పడం తండ్రీ కొడుకులిద్దరికీ అలవాటు లేదు. దివంగత నేత వైయస్సార్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ... నిజం చెబితే తల వేయి ముక్కలవుతుందన్న మునిశాపం చంద్రబాబుకుందని చెప్పేవారు. అది అక్షరాలా నిజం. - చంద్రబాబు క్రెడిట్ చోరీ... వైయస్.జగన్ హయాంలోనే ఆదానీ ఎయిర్ టెల్ గూగుల్ డేటా సెంటర్ కు శ్రీకారం చుడితే... ఇప్పుడు దాని పేరు మార్చి అది తానే తెచ్చానని కధ అల్లి, తానే మైక్రోసాఫ్ట్, గూగుల్ కనిపెట్టినంత ప్రచారం చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని హబ్ గా మార్చింది వైయస్.జగన్ మోహన్ రెడ్డి. కానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చంద్రబాబే తెచ్చినట్లు, దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ లైన్ కట్టినట్లు ప్రచారం చేసుకుంటాడు. అదోక క్రెడిట్ చోరీ. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఫిషింగ్ హార్భర్లు, పోర్టులు వైయస్.జగన్ హయాంలో నిర్మిస్తే... తండ్రి కొడుకులిద్దరూ వాళ్లే టెంకాయ కొట్టి ప్రారంభించినట్లు, గతంలో ఇక్కడే ప్రాజెక్టులు లేనట్టు ప్రచారం చేసుకుంటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు కనీసం భూసేకరణ కూడా చేయలేదు. అయినా 2019లో ఎన్నికల ముందు దానిక్కూడా ఓ టెంకాయ కొట్టి నేనే శంకుస్థాపన చేశానని ప్రచారం చేసుకున్నాడు. కానీ భూసేకరణకు సంబంధించి సుప్రీం కోర్టులు కేసులు పెండింగ్ లో ఉంటే.. వాటన్నింటినీ క్లియర్ చేసి భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణపనులను ప్రారంభించింది కూడా వైయస్.జగనే అయితే.. చంద్రబాబు అక్కడా క్రెడిట్ చోరీకి పాల్పడ్డాడు. ఇది కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు సెజ్ ల అభివృద్ధి వైయస్.జగన్ హాయంలో జరిగింది. వీటిని కూడా ఆయన క్రెడిట్ లో వేసుకున్న చంద్రబాబు... కాకినాడ ఎస్ ఈ జెడ్ ని లో రైతుల భూములను అప్పగించే ప్రక్రియనూ .. ఆయన ఖాతాలో వేసుకుని ఆయనతో పాటు ఆయన కూటమి భాగస్వామ్యులు కూడా చాలా గొప్ప వ్యక్తుల కింది ప్రచారం చేసుకుంటున్నారు. కాకినాడ సెజ్ విషయంలో కూటమి ప్రభుత్వం పచ్చి అబద్దాన్ని వండి వార్చుతుంది. వారికి వంత పాడుతూ దాన్నే నిజమని నమ్మించడానికి ఎల్లో మీడియా ఫేక్ ఫ్యాక్టరీ ప్రయత్నిస్తోంది. ఎస్ ఈ జెడ్ భూములు రైతులకు తిరిగి ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. - కాకినాడ సెజ్ పై ఇవీ వాస్తవాలు... ఎస్ ఈ జెడ్ పై వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు వైయస్.జగన్ పిఠాపురం సభలో ఎక్విజేషన్ కాని భూములన్నింటినీ రైతులకు తిరిగి అప్పగిస్తామని మాట ఇచ్చారు. దీనికోసం ఆయన కేబినెట్ లో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న నన్ను చైర్మన్ గా ఒక కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ పలు దఫాలు సమావేశమై రైతులు, సంస్దలు, అధికారులు, కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంతో పాటు రాజమండ్రి, కాకినాడలో సమావేశమయింది. పలు దఫాల సమావేశాల అనంతరం జూలై 6 2012న జీవో నెంబరు 158 విడుదల చేసాం. దీని ప్రకారం 2180 ఎకరాల భూమిని రిజిష్ట్రేషన్ ఫీజు లేకుండా ఉచితంగా వెనక్కి ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా తామే పిఠాపురం, తుని నియోజకవర్గాలకు సంబంధించిన ఈ భూములను తానే వెనక్కి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటోంది. 14-10-2025 నాడు ఈ ప్రభుత్వం ఒక మెమో జారీ చేస్తూ... అందులో జూలై 6, 2021 న ఇచ్చిన జీవో నెంబరు 158 అంటే వైయస్.జగన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రైతులకు కాకినాడ ఎస్ ఈ జెడ్ భూములను తిరిగి అప్పగిస్తూ ఇచ్చిన జీవోనే.. అమలు చేయండని కేవలం మెమో మాత్రమే ఇచ్చింది. అంతే తప్ప కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి 2003 నుంచి కాకినాడ సెజ్ భూముల పోరాట చరిత్ర గురించి తెలుసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకాలు భయటపడతాయి. సెజ్ పోరాట కమిటీ నాయకులను చంద్రబాబు గృహనిర్భంధం చేసి, ఆయా గ్రామాల్లో పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేశారు. మాట్లాడిన వాళ్లందరినీ జీఎమ్మార్, కేవీరావు నాయకత్వంలో అణగదొక్కారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాతో బాత్‌రూములు కడిగించారని ఆ రోజు సెజ్ పోరాట కమిటీ నేతలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మాట ఇచ్చి మోసం చేసిన బాబు... 2012లో ఏరువాక నిర్వహించి మేం అధికారంలోకి వస్తే రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పిన పెద్దమనిషి ... తీరా అధికారం చేపట్టిన వెంటనే జీఎమ్మార్ కు కొమ్ముకాసి, వారికి జీ హుజూర్ అని, వాళ్లు చెప్పినట్లు చేస్తూ తొత్తులుగా పనిచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు భూములను వెనక్కి ఎందుకు ఇవ్వలేదు ? పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు లోకేష్... కాకినాడ సెజ్ ప్రాంతంలో ఉన్న పంచాయతీలకు అధికారాలు ఉండవు... అన్ని అధికారాలు సెజ్ ల చేతిలో ఉంటాయి. తీర్మానాలు కూడా అవసరం లేదని చెప్పారు. అంత దుర్మార్గంగా పనిచేసి.. రైతులు వారి భూముల కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు నక్సల్స్ పై చేసినట్లు వారిపై దమనకాండ సాగించారు. వైయస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకిచ్చిన హామీని అమలు చేసేందుకు 2020 లోనే కమిటీని నియమించారు. ఏడాది కాలంలోనే అంటే 2021 నాటికే రైతులకు వారి భూములను అప్పగిస్తూ జీవో ఇచ్చాం. అందులో చాలా అంశాలు ప్రస్తావించాం. అక్విజేషన్ చేసిన శ్రీరాంపురం, ముమ్మడివారిపోడు, బండిపాలెం, రాయవారిపోడు, పాటివారిపాలెం, రాఘవరాంపురం గ్రామాలను అందులో నుంచి తొలగించాం. కానీ అక్కడ గ్రామాలు పోయినా ఫర్వాలేదు, సెజ్ రావడమే ముఖ్యం మీ జీవితాలు ఎలా పోయినా ఫర్వాలేదనుకునే చంద్రబాబు నాయుడు తిరిగి మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతులకు తాను మేలు చేసినట్లు అబద్దపు ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. మిగిలిన కేసులు ఎత్తి మీ చిత్తశుద్ధిని నిరూపించుకొండి.. వైయస్.జగన్ కాకినాడ సెజ్ కు సంబంధించి ఎప్పటికీ చారిత్రాత్మక నాయకుడిగా మిగిలిపోవడం ఖాయం. 16 రాష్ట్రాలలో సెజ్ కేసులకు వైయస్.జగన్ కాకినాడ సెజ్ లో తొలగించిన భూములు కేసు ఆధారంగా సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఏపీలో వైయస్.జగన్ భూములను వదిలేయగా లేనిది మీరు ఎందుకు ఆ పనిచేయలేకపోయారని సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. వైయస్.జగన్ వెనక్కి ఇచ్చిన భూములను తామే ఇచ్చామంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. 2180 ఎకరాల్లో 1000 ఎకరాలకు పైగా సర్వే చేసిన అనంతరం రిజిస్ట్రేషన్ చేసి రైతులకు తిరిగి భూములను అప్పగించారు. మరో 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగాలి. ఆ టైంలో రిజిస్ట్రేషన్ శాఖ 2.0 వెర్షన్ ను తీసుకుని రావడంతో అక్కడ సాంకేతికంగా ఉచిత రిజిష్ట్రేషన్ ను అంగీకరించక పోవడంతో వారికి రిజిస్ట్రేషన్ నిల్చిపోయింది. భూములు మాత్రం రైతులు చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు వారికి రిజిష్ట్రేషన్ చేయడానికి మెమొ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అంతా మేమే చేశామని చెప్పుకుంటున్నారు. మేం ఇచ్చిన 158 జీవోలో చాలా అంశాలు ఉన్నాయి. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుని...వైయస్.జగన్ హయాంలో చట్టం చేశాం. కూటమి ప్రభుత్వం ముందు దాన్ని అమలు చేయాలి. సెజ్ కు సంబంధించిన చంద్రబాబు హయాంలో పెట్టిన కేసులన్నీ వైయస్.జగన్ హయాంలో కేసులు ఎత్తేశాం. ఇంకా కొన్ని చోట్ల సాంకేతిక పరమైన కారణాల వల్ల సెజ్ పోరాట నేతల మీద కేసులు ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే వాటిని తొలగించండి. వందలాది హేచరీస్ ఉన్నాయి.. వాటిని కాపాడ్డంతో పాటు సముద్రంలో పొల్యూషన్ కలవకుండా ఉండడానికి అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేశాం . అక్కడే ఏర్పాటు అవుతున్న దివీస్ సంస్థ కాలుష్యాన్ని నియంత్రించాలి... సముద్రంలో వ్యర్ధాలు వదిలితే మత్స్యకారులకు నష్టం కలుగుతుంది, హేచరీస్ కు కూడా నష్టం కలుగుతుందని.. వ్యర్ధాలను ప్రాసెస్ చేసి, ప్యూరిఫై చేసి దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టాలని ఆదేశించాం. ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాం. అంతేకాకుండా దివీస్ సంస్థ తీసుకున్న అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.3 లక్షలు చెల్లిస్తుంటే... రూ.10 లక్షలు చెల్లించాలని వైస్.జగన్ ఆదేశించారు. ఇది నిజం కాదా? ఇలా అన్ని విధాలా రైతులకు వైయస్.జగన్ ప్రభుత్వం మేలు చేస్తే.. మీరు చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ఇటీవల పోరాట కమిటీ నాయకులతో కూడా ప్రెస్ మీట్ పెట్టాం. జిమ్మార్, కేవీరావులకు చంద్రబాబు నాయుడు సహకరించడమే ఈ మొత్తం దుర్మార్గాలకు కారణమని స్పష్టం చేశాం. భూములు రైతుల వద్ద ఉండగానే ఆ రికార్డులను ఐసీఐసీఐలోనూ, ఎల్ ఐ సీలోనూ దఖలు పెట్టి జిమ్మార్ కంపెనీ రూ. 2,500 కోట్లు రుణాలు తీసుకున్నారు. రైతులకు ఎకరాకు రూ.3 లక్షలిచ్చి, వారి భూమి దఖలు పడకుండానే అప్పు తెచ్చారు. కేవీ రావు గారు కూడా బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి దాదాపు రూ.6 వందల కోట్లు రైతుల భూముల మీద అఫ్పు తెచ్చారు. వాటి మీద ఎందుకు విచారణ చేయడం లేదు? మీరు రైతులను రోడ్డు మీద వేసి అడిగితే నెలల తరబడి జైల్లో వేస్తే... వైయస్.జగన్ వచ్చిన తర్వాత వారి భూములను వారికి వెనక్కి ఇస్తే.. ఆ క్రెడిట్ కూడా కొట్టేద్దామని ప్రయత్నిస్తున్నారు. మీరు కొత్తగా ఏదైనా చేయండి. మరో 2వేల ఎకరాల రైతులకు వెనక్కి ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే మరేమీ చేయరు. ఎంతసేపు క్రెడిట్ చోరీ ఆలోచన తప్ప మరో కార్యక్రమం లేదు. కార్పొరేట్ కు కొమ్ముకాయడం బాబుకు అలవాటు... చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా.. జనవరిలో అంటే అధికారం కోల్పోయే ముందు రూ.101 కోట్లు డెవలప్ మెంట్ ఛార్జీలు రద్దు చేస్తూ.. కార్పోరేట్ కంపెనీకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మా భూములు మాకిచ్చేయండి రైతులు, పోరాట కమిటీ పెద్దలు పోలీసులు కాళ్లమీద పడ్డా... చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు సరికదా.. వాళ్లు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆ ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 104 అమల్లో ఉంది. చంద్రబాబు ప్రభుత్వ ఆధ్వర్యంలో... రైతులపై సాగించిన ప్రతి దమనకాండకు ఆధారాలున్నాయి. చెరువులు, కుంటలు కూడా వదలకుండా ఆ రోజు భూములు సేకరించారు. కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్ లో ఉంటే డెవలప్ మెంట్ మాత్రం వీక్ గా ఉంటుంది. కేవలం ప్రచారం మీద మాత్రమే బ్రతుకుతున్న ప్రభుత్వమిది. కార్పొరేట్ కంపెనీలంటే సాగిలపడ్డం చంద్రబాబుకు అలవాటు. రూ.99 కే మద్యం అని - 99 పైసలకే ఎకరా అడ్డగోలు అమ్మకం.. ఎన్నికల మందు రూ.99కే క్వార్టర్ బాటిల్ ఇస్తానని ప్రచారం చేసిన చంద్రబాబు... గెలిచిన తర్వాత 99 పైసలకు ఎకరం భూమిని కట్టబెడుతున్నాడు. ఇదేమని ప్రశ్నిస్తే... టీసీఎస్, కాగ్నిజెంట్ కు ఇస్తున్నామని చెబుతున్నారు. తాజాగా విశాఖలో వేలాది కోట్ల విలువైన భూమిని కారుచౌకగా లులూకు కట్టబెడుతున్నారు. అదే లులూ గ్రూపు ఇతర రాష్ట్రాల్లో తమ మాల్స్ ఏర్పాటు కోసం వందలాది కోట్ల రూపాయులు ఖర్చు చేసి కొంటున్నారు. మన రాష్ట్రంలో ఇంత కారు చౌకగా ఎందుకు ఇస్తున్నట్టు. కార్పొరేట్ కంపెనీలంటే సాగిలపడ్డం చంద్రబాబుకు అలవాటు. దీని వెనుక మతలబు ఏంటి ? వాళ్లమైనా పెద్ద కేన్సర్ ఆసుపత్రి కట్టి పేదలకు సేవ చేస్తున్నాడా? గూగుల్ పై భారీ ప్రచారం చేస్తున్నారు. మీరు విపరీతంగా అభిమానించే అమరావతికి ఎందుకు గూగుల్ రావడం లేదు? ఇదే మాట ప్రశ్నిస్తే.... రానున్న పదేళ్లలో విశాఖలో భారీ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఈ మాట వైయస్.జగన్ చెబితే దానిపై తప్పుడు ప్రచారం చేస్తారు. క్రెడిట్ చోరీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికైనా చంద్రబాబు అబద్దాలు కట్టిపెట్టి.. వీలైతే ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పవన్ కళ్యాణ్ ది పబ్లిసిటీ షో...: దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి. గడిచిన నెల రోజులుగా కాకినాడ జిల్లాలో డైవర్షన్ సమావేశాలు, కూటమి నేతల హడావుడి చూస్తున్నాం. కాకినాడ సెజ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంద రోజుల గడువు కావాలని అడిగారు. నిజానికి ఈ సమస్య వారం రోజుల్లో పరిష్కారమయ్యే ఒప్పందాన్ని గతంలో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో ఆయా కంపెనీలతో చేసుకున్నారు. పనులు కూడా మొదలయ్యాయి. నేను ఆ ఒప్పందం సమయంలో భాగస్వామిగా ఉన్నాను. వైయస్.జగన్ కు వివరించి.. హేచరీ యాజమానులకు ఆయన వద్దకు తీసుకెళ్లాను. ఆ టైంలో ఆయన కొత్తగా వచ్చే కంపెనీ కోసం నేరుగా 20 వేల వరకు ఉపాధి కల్పించే పాత కంపెనీని ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు. హేచరీస్ కి ఇప్పంది లేకుండా కొత్త కంపెనీలు తమ పరిశ్రమలోని వ్యర్ధాలను 30 కిలోమీటర్లు దూరం వరకు తీసుకెళ్లేందుకు అవసరమైన పైపులైన్ ఏర్పాటు చేసేలా ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఖర్చు కూడా ఆ కంపెనీలే భరించేలా ఒప్పించారు. అలా చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది... ఆ దిశగా డిప్యూటీ సీఎం ఆలోచన చేయాలి. అలా కాకుండా షో చేయడం వలన ఉపయోగం లేదు. ఇక లూలుకు అప్పనంగా వేలాది కోట్లు విలువైన భూములు ధారాదత్తం చేస్తున్నారు. భారత్ లోనూ, మలేషియాలో లులూ మాల్స్ తీసుకుంటే.... అత్యం తక్కువ జీతాలు. సత్వా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు. వాటర్ పాకెట్ కూడా రాని ధరకే ఎకరా భూమి అప్పగిస్తున్నారు. ఇదా విజన్ ? బ్రిటిష్ పాలన కంటే అధ్వాన్నంగా చంద్రబాబు పాలన ఉంది. పేదలంటే కనీసం ప్రేమ ఈ ప్రభుత్వానికి లేదు. 66 ఏళ్ల లీజుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కట్టబెడుతున్నారు. ఈ ప్రభుత్వంలో మనిషి ప్రాణాలకు లెక్కలేకుండా పోయింది. శాంతి భద్రతలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయి. నెల్లూరులో అత్యంత అమానుషంగా కారుతో ఎక్కి తొక్కించి చంపితే... దాన్ని కూడా బయటకు రానీయకుండా తొక్కిపెడుతున్నారు. కనీసం పట్టించుకోని ప్రభుత్వం... ఎవరైనా పరామర్శకు వెల్తే వారికి కులం, రాజకీయ రంగు అంటగడుతున్నారు. ఘటన జరిగిన 18 రోజుల తర్వాత హోంమంత్రి, స్థానిక మంత్రులు పరామర్శకు వెళ్తారా? ఇది ఏ రకమైన పరిపాలన అని దాడిశెట్టి నిలదీశారు. - రాష్ట్రంలో మద్యం లేని చోటు లేదు...: వంగా గీత, మాజీ ఎంపి. రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల భద్రతలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైంది. చిన్నారుల మీద ఎక్కడైనా అకృత్యాలు జరిగితే ఆ ఘటన నుంచి డైవర్షన్ చేయడం తప్ప... నిందితులను శిక్షించడమూ, బాధితులకు అండగా నిలబడ్డమూ చేయడం లేదు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారికి కులం, రాజకీయ రంగు పూయడం అలవాటుగా మారింది. నాణ్యమైన మద్యం అందిస్తామంటూ పదే, పదే ప్రచారం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రభుత్వమిది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కల్తీమయమే. గుడి, బడి, గ్రంధాలయం లేని చోటు ఉందేమో కానీ... మద్యం దొరకని చోటు రాష్ట్రంలో లేదు. - సెజ్ సమస్యలు తీర్చి పాలాభిషేకాలు చేసుకొండి.. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసి.. పేదల ప్రాణాలను హరిస్తున్న దుర్మార్గ ప్రభుత్వమిది. అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం ఆందోళనలో ముంచేసింది. కాకినాడ సెజ్ కు సంబంధించి... ఈ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్తోంది. కాకినాడ సెజ్ లో చరిత్ర సృష్టించారంటూ అనుకూల పత్రికల్లో పచ్చి అబద్దాలు రాస్తున్నారు. ఊళ్లకు ఊళ్లు సెజ్ లో కలిసిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళను అర్ధం చేసుకున్న వైయస్.జగన్ పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీ మేరకు వారి భూములు వారికి తిరిగి అప్పగించారు. పోరాట కమటీ నేతలు, ప్రజలు త్యాగాలను అర్దం చేసుకుని వారికి వైయస్.జగన్ మేలు చేస్తే.. ఒక మెమోతో పచ్చి అబద్దాలు చెప్పి అంతా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. తాను చేయనిది చేశామని చెప్పుకోవడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సిగ్గుచేటు. మీకు చేతనైతే రైతుల మీద పెట్టిన కేసులు ఇంకా ఒకటి అరా పెండింగ్ లో ఉండే వాటిని ఎత్తివేసి వారికి మేలు చేయండి. వైయస్.జగన్ ప్రభుత్వం చట్టం ద్వారా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకొని, అప్పుడు పాలాభిషేకాలు చేసుకోవాలని సూచించారు. మరోవైపు సెజ్ లో ఉన్న సమస్యలను తీర్చి సంబరాలు చేసుకోవాలని, అంతే తప్ప వైయస్.జగన్ హయాంలో రైతులు మేలు చేస్తూ తీసుకున్న నిర్ణయాలను మీ ఖాతాలో వేసుకుని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పొద్దని మండిపడ్డారు.