పోలీసు అమ‌ర‌వీరుల‌కు సెల్యూట్ చేద్దాం

పోలీసు అమరవీరులకు వైయ‌స్ జగన్ నివాళి

తాడేపల్లి: పోలీసు అమరవీరులకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను వైయ‌స్ జ‌గ‌న్‌ గుర్తు చేసుకున్నారు. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం అంటూ ఎక్స్‌ వేదికగా వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. 

Back to Top