కరోనా అయినా.. తుపానులైనా.. 

జనం మధ్యే వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

విపత్తు ఏదైనా వైయ‌స్ జగన్‌ పిలుపుతో ప్రజల క‌ష్టాల్లో అండ‌గా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

మొంథా తుపాను సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ సైన్యం

ప్రజలను పునరావాస శిబిరాల తరలించడంలో సాయం

శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ప్రజలకు బాసటగా నిలిచిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

బాధితులకు మేలు చేస్తున్న వైయ‌స్ జగన్‌ తెచ్చిన వ్యవస్థలు

తాడేప‌ల్లి: రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా.. ఏ తుపాను వచ్చినా ప్రజలకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు నిలబడుతున్నారు. ప్రజల మధ్య ఉంటూ వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నారు. గతంలో కోవిడ్‌  విపత్తులోనూ.. వివిధ తుపానులు సంభవించినప్పుడు కూడా వారి వెంటే ఉంటూ సాయం అందిస్తున్నారు. తాజాగా మొంథా తుపాను నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైయస్‌ జగన్‌ పిలుపు మేరకు  శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకం అవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో వారిని పునరావాస శిబిరాలకు తరలించడంలోనూ.. బాధితులకు ఆహారం సమకూర్చడంలో చొరవ చూపుతున్నారు.
    
ప్రజల కోసం జనం నుంచి పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్సందించి వారికి ఆపన్న హస్తం అందిస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసమే నిలబడుతుంది. కరోనా విపత్తు సమయంలోనూ..తుపానుల సమయాంలోనూ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పిలుపు మేరకు తక్షణం స్పందించి ప్రజలకు మేమున్నాం అంటూ వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ముందు వరసలో నిల్చుంటున్నారు. ఇక వైయస్‌ జగన్‌ తెచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీరు వ్యవస్థ, రేషన్‌ వాహనాలు నాడు జగన్‌ హయాంలోనే యుద్ధంలో సైనికుల మాదిరిగా ప్రజలకు సేవలందించాయి. 

సచివాలయ వ్యవస్థ 
వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ  పౌర సేవలు అందించడమే కాకుండా.. విపత్తుల్లోనూ కీలకం పనిచేస్తున్నాయి.  మోంథా తుపాను సహాయక కార్యక్రమాల్లో ఇప్పుడు కీలకంగా మారాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో మారుమూల తాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు 24 గంటలూ పనిచేశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే ప్రభుత్వం అందించే తుపాను తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలకు చేరవేశారు. చాలాచోట్ల సచివాలయాల ఉద్యోగులు తమ పరిధిలో వీధి వీధికీ వెళ్లి తుపాను సమాచారాన్ని నేరుగా అక్కడి ప్రజలకు తెలియజేశారు. త్రస్థాయిలో తుపాను ప్రభావానికి గురైన గ్రామ వివరాలతో పాటు అక్కడ ఈదురు గాలులు, వర్షాల కారణంగా స్థానికంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు వంటి వివరాలపై ఎంపీ­డీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి తక్షణ నివేదికలు అందజేశారు. 


ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాలంటీర్ల సేవలు
జగన్‌ హయాంలో వాలంటీర్లు వ్యవస్థ ప్రజల గడప వద్దనే సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కరోనా విపత్తు సమయంలో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించారు. ఫీవర్‌ సర్వేలు నిర్వహించడం, కోవిడ్‌ పేషంట్లను గుర్తించడం, క్వారంటైన్ కు తరలించడం వంటి సేవల్లో పాలుపంచుకున్న విషయం తెలిసిందే. తుపానుల సమయంలో బాధితులను పునరావాస శిబిరాలకు తరలించడం, వారికి ఇంటి వద్ద రేషన్‌ తదితర సాయాలను అందించడంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి వాలంటీర్లకు రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు జీతం పెంచుతామని చెప్పి అసలు వాలంటీరు వ్యవస్థనే 

రేషన్‌ డోర్‌ డెలివరీ  
వైయస్‌ జగన్‌ తెచ్చిన మరో వ్యవస్థ.. రేషన్‌ వాహనాల ద్వారా రేషన్‌ డోర్‌ డెలివరీ. జగన్‌ ఐదేళ్ల పాలనలో 9,260 రేషన్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ గడపవద్దనే సరఫరా చేశారు. దీంతో ప్రజలు వ్యయప్రయాసలుకు లోనుకాకుండా సౌకర్యవంతంగా సరకులు ఇళ్ల వద్దనే అందించారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాత విజయవాడ వరదల సమయంలోనూ రేషన్‌ వాహనాలను బాధితులకు సరకులు, ఇతర సామగ్రిని పంపించడానికి వినియోగించారు. కానీ జగన్‌ పై అక్కసుతో రేషన్‌ వాహనాల ద్వారా డోర్‌ డెలివరీ కార్యక్రమాన్ని చంద్రబాబు రద్దు చేశారు. అవి కూడా ఉంటే తుపాను బాధితులకు వేగంగా సేవలు అందించడానికి వీలవుతుంది.

వేగంగా ఎన్యూమరేషన్‌, పంట నష్ట పరిహారం
గత చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే వరదలు, తుపానులు కారణంగా పంట నష్టాల  ఎన్యూమరేషన్‌, బీమా పరిహారం అందించడంలో వైయస్‌ జగన్‌ సర్కారు విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఏ సీజన్‌ లో పంట నష్టపోతే ఆ సీజన్‌ లోనే పరిహారాన్ని జగన్‌ సర్కారు అందించింది. 
2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 116.74 కోట్లు, 20020-21లో 931.87 కోట్లు, 2021-22లో 564.22 కోట్లు, 2022-23లో 298.98 కోట్లు,  2023-24లో 55.20 కోట్లను ఇన్‌ పుట్‌ సబ్సిడీగా రైతులకు అందించింది. 2023 ఖరీఫ్‌ లో కరువు సాయంగా రూ.847.23 కోట్లు, అదే ఏడాది మిచాంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.442.36 కోట్లు, 2024 మార్చిలో మరో రూ.1294.59 కోట్లు కలిపి ఐదేళ్లలో మొత్తం రూ.3,261 కోట్లను అందించడం జరిగింది. ఇది కాక రైతు భరోసా కింద ఐదేళ్లలో 34288.17 కోట్లు రైతులకు జగన్‌ సర్కారు అందించింది. 


కానీ చంద్రబాబు పాలనలో అసలు పంట నష్టం అంచనాల రూపకల్పన, సాయంలోనూ తీవ్ర జాప్యం నెలకొంది. ప్రీ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా రైతులకు జగన ప్రభుత్వం మేలు చేస్తే.. చంద్రబాబు ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. గత నాలుగు సీజన్లు అంటే.. 2024 ఖరీఫ్‌, రబీ, 2025 ఖరీఫ్‌, రబీలకు సంబంధించి రైతులకు ఇన్‌ పుట్‌ సబ్సిడీని చంద్రబాబు సర్కారు ఎగవేసింది. 

ప్రజల్లోనే వైయ‌స్ఆర్‌సీపీ..
వైయస్‌ జగన్‌ ఆదేశాలతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం లో పలు గ్రామాల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు  చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు, యధాల స్టాలిన్  తదితరులు తుపానుకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు.  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా  తదితరులు పర్యటించారు. తుని నియోజకవర్గం,తొండంగి మండలం పెరుమల్లపురం పోర్టు లో పర్యటించి, ధ్వంసం అయిన మత్యకారుల బోట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు ఆర్థిక సాయం చేశారు.  కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలో తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించి  ఆహార, ఆరోగ్య, వైద్య, పారిశుద్ధ్య వసతుల పై ఆరా తీస్తున్న మాజీ ఎమ్మెల్యే  సింహాద్రి రమేష్ తదితరులు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో తుపాను బాధితులను యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు  పరామర్శించారు. రైల్వే కోడూరు నియోజకవర్గం  ఓబులవారిపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జి లోకి  వర్షపు నీరు చేరి ప్రమాదకరస్థాయిలో ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.  చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం రాయల చెరువును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తదితరులు పరిశీలించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నందమూరు గ్రామంలో రైతులు తీవ్రంగా నష్టపోయిన పంటలను మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ  పరిశీలించారు.మచిలీపట్నం మండలం సిరివెల్లపాలెంలో పార్టీ మచిలీపట్నం ఇన్‌ చార్జి పేర్ని కృష్ణమూర్తి  తదితరులు పర్యటించి ప్రజలు   ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలను  గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు  పరిశీలించారు. 

పునారావసం శిబిరాల్లో జనం కష్టాలు 
పునరావాస శిబిరాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తుపాను బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డ పునరావాస కేంద్రంలో ఇద్దరు బిడ్డలతో వచ్చిన లక్ష్మీ తిరుపతమ్మ  అనే మహిళను కట్ల పాము కాటు వేసింది. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. 

 
 
వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌ర్య‌ట‌న‌

  • వరి పంటను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, గిరిజాల బాబు తదితరులు
  • కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలో తుఫాను పునరావాస కేంద్రాలను సందర్శించి వసతుల పై ఆరా తీస్తున్న మాజీ ఎమ్మెల్యే  సింహాద్రి రమేష్ తదితరులు.
  • చల్లపల్లి మండలం వక్కలగడ్డ పునరావాస కేంద్రంలో పాము కాటుకు గురై చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీ తిరుపతమ్మ 
  • మత్స్యకారులకు ఆర్థిక సాయం చేస్తున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తదితరులు
  • తుపాను బాధితురాలి సమస్యలు తెలుసుకుంటున్న యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు   
  • రైల్వే కోడూరు నియోజకవర్గం  ఓబులవారిపల్లిలో రైల్వే అండర్ బ్రిడ్జి ని పరిశీలిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు  
  • రాయల చెరువును పరిశీలిస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తదితరులు 
  • పంటలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ  
  • మార్కాపురం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలను  పరిశీలిస్తున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు   
  • ఉదయగిరి లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ప్రియతమనియోజకవర్గం ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తదితరులు
Back to Top