తాడేపల్లి: నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకునే సీఎం చంద్రబాబు తన విదేశీ పర్యటనపై ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని వైయస్ఆర్‌సీపీఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీకార్యాలయంలో మీడియాలో మాట్లాడుతూ... గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులంతా తమ పర్యటన వివరాలను మీడియా ద్వారా ప్రజలకు చెప్పేవారని, కానీ చంద్రబాబు మాత్రం అనుమానాస్పదంగా ఎందుుకు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు గురించి బాకాలు ఊదే ఎల్లో మీడియా సైతం ఆయన పర్యటనపై పరస్పరం భిన్నంగా ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించారు. కనీసం జీఏడీ దగ్గర కూడా చంద్రబాబు పర్యటన వివరాలు లేకపోవడాన్ని ఆక్షేపించారు. ఏడాదిన్నరగా దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే సింగపూర్ వెళ్లి ఉంటాడనే ఊహాగానాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయని స్పష్టం చేశారు. చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం లోకేష్ లండన్ లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు లండన్ వెళ్లే అవకాశమే లేదని చెబుతున్నారని.. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలపై ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు రోజూ ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్‌లలో తిరుగుతూ జల్సాలు చేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు కూడా తమ పర్యటనలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో బహిర్గతం చేయాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● జీఏడీ వద్ద కూడా సమాచారం లేదు సీఎం చంద్రబాబు, టీడీపీ గురించి అనుక్షణం బాకాలు ఊదే ఎల్లో మీడియా విదేశీ పర్యటనకు ఎక్కడికి పోయాడో, ఎందుకు పోయాడో చెప్పడంలో మాత్రం తలోమాట రాస్తూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొన్ని పత్రికలు వైద్యం కోసం లండన్ వెళ్లాడని, కొన్ని పత్రికలు కుటుంబంతో కలిసి వ్యక్తిగత పర్యటనకి వెళ్లాడని రాశాయి. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు తమ పర్యటన వివరాలను మీడియాతో ద్వారా ప్రజలకు తెలిపేవారు. కానీ నా జీవితం తెరిచిన పుస్తకం, నా జీవితంలో ఎలాంటి దాపరికాలు ఉండవని చెప్పుకునే చంద్రబాబు, ఎక్కడికి వెళ్తున్నదీ, ఎవరితో వెళ్తున్నదీ.., అధికార పర్యటనతో వెళ్లాడా? వ‌్యక్తిగత పర్యటనకు వెళ్తున్నాడో అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? ఇదే ఆయనలో ఉన్న పారదర్శకత? సాధారణ పరిపాలన శాఖ వద్ద కూడా సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత దాపరికంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రబాబు తన పర్యటన వివరాలను రహస్యంగా ఉంచడం వల్లన ఆయన ప్రయాణంపై రకరకాల ఊహాగానాలు ప్రజల్లో చలామణిలోకి వచ్చాయి. కొంతమంది సింగపూర్ వెళ్లాడని, కొంతమంది బాలి వెళ్లాడని ప్రచారం చేస్తున్నారు. లండన్ వెళ్తున్నట్టు పచ్చ మీడియా ద్వారా ప్రజలను నమ్మించి తనకి ఎంతో ఇష్టమైన సింగపూర్ వెళ్లాడని మరికొందరు గుసగుసలాడుతున్నారు. సీఎం చంద్రబాబు మాత్రమే కాదు.. నూతన సంవత్సరం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సకల శాఖల మంత్రి అనిపించుకునే నారా లోకేష్ సహా చాలా మంది మంత్రులు, ఎంపీలు అమరావతిలో అందుబాటులో లేకుండా అదృశ్యమైపోయారు. వారు ఎక్కడికి వెళ్తున్న విషయాన్ని కనీసం ప్రజలకు సమాచారం కూడా ఇవ్వకుండా కనిపించకుండా పోవడంపై ప్రజల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని దిక్కులేని పరిస్ధితుల్లోకి వెళ్లిపోయింది. లండన్‌లో ఇప్పటికే కొడుకు నారా లోకేష్ ఉండటంతో చంద్రబాబు అక్కడికి వెళ్లడని కొందరు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడి సీఎం కుర్చీకి లోకేష్ నుంచే గండం పొంచి ఉందని ఎంతోమంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విదేశీ పర్యటనపై జరుగుతున్న చర్చను చూసి టీడీపీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. ● నాడు వైయస్ జగన్ పర్యటనపై దుష్ప్రచారం కొన్ని నెలల కిందట మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం కోసం లండన్ వెళితే.. దాన్ని ఎల్లో మీడియా నచ్చిన విధంగా వక్రీకరించి దుష్ప్రచారం చేసింది. తన పర్యటన వివరాలను మీడియాకు వెళ్లడించినప్పటికీ దిగజారుడు రాజకీయాలు చేశారు. తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానంలో మాజీ సీఎం వైయస్ జగన్ వెళితే మాత్రం నానా యాగీ చేశారు. కానీ ముఖ్యమంత్రి గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు మాత్రం తన పర్యటన ఎక్కడికి అనే విషయం చెప్పకుండా రహస్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లి ఉంటే ఆ వివరాలను జీఏడీ ఎందుకు చెప్పడం లేదు? కానీ రహస్యంగా ఉంచడం చూస్తుంటే ఏడాదిన్నర కాలంగా దోచుకున్న అవినీతి సంపదను పంచుకోవడానికి వెళ్లారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ● బిల్లులు బయట పెట్టండి ప్రజల సొమ్ముతో మూడు ప్రత్యేక విమానాల్లో ముగ్గురు నాయకులు రోజూ జల్సాలు చేస్తూ తిరుగుతున్నారా లేదా? వైయస్ఆర్‌సీపీనాయకులు చెబుతున్న అంశాలను నిజమో కాదో జర్నలిస్టులు కూడా విచారణ చేసి నిర్ధారించాలి. సొంత ఖర్చులతో తిరుగుతున్నామని చెప్పుకుంటున్న లోకేష్, పవన్ కళ్యాణ్ లకు వస్తున్న జీతాలకు, వారు చేస్తున్న ఖర్చులకు ఎక్కడైనా పొంతన ఉందా? సొంత డబ్బులతో వెళ్తున్నట్టయితే వారి ప్రయాణాల కదలికలన్నీ పౌరవిమానాయన శాఖ పరిధిలోనే ఉన్నాయా అనేది చెప్పాలి. సొంత ఖర్చులతో వెళ్లినా, ప్రభుత్వ డబ్బుతో టూర్లు వేసినా డీజీసీఏ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా దానికి బిల్ రైజ్ చేయాలి. ఆ ఖర్చుల వివరాలు బహిరంగ పరచాలి. ఆ బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు? ● మళ్లీ రూ. 4500 కోట్ల విద్యుత్ చార్జీల భారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకుండా రూ. 4,500 కోట్లు కరెంట్ బిల్లుల భారం మోపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు కరెంట్ చార్జీలు పెంచబోమని.. ఇంకా తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు, వచ్చీరాగానే రూ. 13,500 కోట్లు కరెంట్ చార్జీల భారం ప్రజలపై మోపాడు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన బిల్లులకు రెట్టింపు కరెంట్ బిల్లులు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌లకి ఎల్లో మీడియా బాహుబలికి మించిన ఎలివేషన్లు ఇస్తుంటే, ప్రజలు మాత్రం ఆయన పాలన చూసి చీదరించుకుంటున్నారు. 2025 లో మోసం చేసిన కూటమి నాయకులు ఇప్పటికైనా మనసు మార్చుకుని సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి.