వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట

అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు 

విజ‌య‌వాడ‌:   వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. బెజవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై నమోదైన హత్యాయత్నం కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  మాచవరం పీఎస్ పరిధిలో వంశీపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో, తనను అన్యాయంగా ఇరికించారంటూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వంశీని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

వంశీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వంశీకి ప్రాణహాని ఉందని, అరెస్ట్ అవసరం లేదని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, పోలీసులకు తాత్కాలికంగా అరెస్ట్ నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో వల్లభనేని వంశీకి తాత్కాలిక ఊరట లభించగా, కేసుపై తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.  

Back to Top