అనంతపురం: నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అనంతపురంలో ఉద్రికత్త నెలకొంది. వైయస్ఆర్‌సీపీ నాయకులను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ జెడ్సీటీసీపై హత్యయత్నం చేయడంతో తీవ్ర గాయలయ్యాయి. దీంతో, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. వివరాల ప్రకారం.. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్ రెచ్చిపోయారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైయస్ఆర్‌సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ నేతల ధర్నాకు దిగారు. అనంతరం, ధర్నా చేస్తున్న వారిపై కూడా టీడీపీ నేతలు మరోసారి దాడి చేశారు. దీంతో, జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నేతల దాడుల నిరసనగా గాయాలతోనే యల్లనూరు పీఎస్ వద్ద ప్రతాప్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు బైఠాయించారు. కూటమి ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.