రాజంపేటలో వైయ‌స్ఆర్‌సీపీ బూత్ కమిటీ కీలక సమావేశం  

 అన్నమయ్య జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ బూత్ కమిటీ విభాగం రాజంపేట పార్లమెంట్ స్థాయి సమావేశం అకేపాడు ఎస్టేట్‌లో జరిగింది. ఈ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధి,  రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు హాజరై పార్టీ బలోపేతంపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొండమడుగుల సుధాకర్ రెడ్డి, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు నడివీధి సుధాకర్, కోడూరు నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు తిప్పన నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంపై, బూత్ కమిటీల సమన్వయం పెంపుపై నాయకులు చర్చించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
 

Back to Top