కళ్యాణదుర్గంలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

కొత్తూరు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి 

క్ష‌త‌గాత్రుల‌కు మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య ప‌రామ‌ర్శ‌

అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో  టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అధికార మ‌దంతో కొత్తూరు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీ కార్యకర్తలపై దాడికి ప‌చ్చ‌మూక‌లు తెగ‌బ‌డ్డాయి. ఈ దాడిలో ఆరుగురు వైయ‌స్ఆర్‌సీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా, క్ష‌త‌గాత్రుల‌ను  ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొత్తూరు గ్రామంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నేతల యత్నించారు. ఈ విష‌యంపై వైయ‌స్ఆర్‌సీ నేత‌లు రెవెన్యూ, పోలీసు అధికారుల కు ఫిర్యాదు చేశారు. దీంతో జీర్ణించుకోలేని టీడీపీ నేత‌లు తమ పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 

ప‌రామ‌ర్శ‌
టీడీపీ గుండాల దాడిలో గాయపడిన క్ష‌త‌గాత్రుల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య ప‌రామ‌ర్శించారు.  కొత్తూరు గ్రామానికి చెందిన అక్కమ్మ ఆరోగ్య పరిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. అక్కమ్మకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.  అక్కమ్మ కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని తలారి రంగయ్య భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో కళ్యాణదుర్గం రూరల్ కన్వీనర్ గోళ్ళ సూరి, కొత్తూరు సర్పంచ్ బాబు ఉన్నారు.

Back to Top