తుపాన్‌లోనూ `కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌`

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కొన‌సాగుతున్న ప్ర‌జా ఉద్య‌మం

వైయ‌స్ఆర్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం.. కూటమి ప్రభుత్వ పాతరకు కారణం 

పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చడమే చంద్రబాబు ధ్యేయం

కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతాం:  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు హెచ్చ‌రిక‌

తాడేప‌ల్లి:  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా ర‌చ్చ‌బండ‌- కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం మోంతా తుపాన్ గ‌ర్జిస్తున్నా..వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు లెక్క చేయ‌కుండా సంత‌కాల సేక‌ర‌ణ‌లో పాల్గొని ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తున్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ పాతరకు కారణం కాబోతోందని  పార్టీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు వైద్య విద్యను కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు దూరం చేయబోతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏనాడూ కూడా సొంత బలంతో గెలవలేక పోయాడని, దత్తపుత్రుడు ఆర్భాటాన్ని ప్రజలు నమ్మబట్టే గత సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. ఇప్పుడు ప్రజలు నిజం తెలుసుకొని వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి నిజాయితీని విశ్వసనీయతను నమ్ముతున్నామని అంటున్నారన్నారు. 2029లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల పాలన ప్రారంభం కాబోతోందని వైయ‌స్ జగన్‌ 2.0 కి రథసారథులు కార్యకర్తలే అన్నారు. 

పీపీపీ విధానం విర‌మించుకోవాలి:
సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. స్వార్థం కోసం ఇలాంటి కుట్రకు తెరతీయడం సబబు కాదన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటు పరంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నా కూటమి పాలకులల్లో ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సదాలోచనతో రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీలకు పునాది రాళ్లు వేయగా అందులో 5 మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యాయన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. 

కూటమి ప్రభుత్వ మెడలు వంచేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పీపీపీ విధానం రద్దుకు కోటి సంతకాల సేకరణ కార్యాచరణ చేపట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పనులు అంతంత మాత్రమేనని, ప్రచారంలో మాత్రం ఆహా..ఓహో.. అని డప్పు కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చంద్రబాబుకు ఎన్నటికీ చేతకాదన్నారు. మూడేళ్లు గడిస్తే రెడ్ బుక్‌‌ రాజ్యాంగం తుడిచిపెట్టుకు పోతోందన్నారు. కూటమిని కూకటి వేళ్లతో పీకేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల వివరాలు

కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.యస్.మక్బూల్  ఆధ్వర్యంలో రచ్చ బండ కార్యక్రమం మరియు మెడికల్ కాలేజ్ ల ప్రవేటికరణ వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ, గాండ్లపెంట, సోమయాజులపల్లి, తూపల్లి, మల్లమీదపల్లి పంచాయతీలో  కోటి సంతకాల సేకరణ. 

మచిలీపట్నం రూరల్ నార్త్ మండలంలోని పెద కరగ్రహారం  గ్రామంలో  మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కోటి సంతకముల సేకరణ కార్యక్రమం  లో   మచిలీపట్నం నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జీ పేర్ని కృష్ణమూర్తి కిట్టు

 

అమరాపురం మండలం నిద్రగట్ట గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో మడకశిర సమన్వయకర్త ఈర లక్కప్ప

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట  నాయుడుపేటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం లో  మాజీ శాసనసభ్యుడు సంజీవయ్య


నర్సీపట్నం మండలం అమ్మలాపురం గ్రామంలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్

Back to Top