తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ‘కోటి సంతకాల సేక‌ర‌ణ‌`

తిరుప‌తి:  కూట‌మి ప్ర‌భుత్వం తీసుక‌న్న‌ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యంపై ప్ర‌జాగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. తిరుపతి న‌గ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ‘కోటి సంతకాల సేక‌ర‌ణ‌` కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. 
వైయ‌స్ఆర్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎంపీ డాక్ట‌ర్‌ గురుమూర్తి, తిరుపతి సమన్వయ కర్త భూమన అభినయ్, మేయర్ శిరీష, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ బాబు,టౌన్ బ్యాంకు చైర్మన్ జయచంద్రా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ,నగర అధ్యక్షుడు రవిచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ప్రైవేటీకరణ పేరుతో ప్రజా వైద్యవిద్యను పేదలకు దూరం చేస్తున్నారు: ఎంపీ డా గురుమూర్తి   
        జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఆమోదం పొందగా, వాటిని పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతోందన్నారు ఇది ప్రజా వైద్య విద్యను కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి నెట్టే ప్రయత్నం అని తీవ్రంగా విమర్శించారు.

ఉద్యమంలా రచ్చబండ కోటి సంతకాల ఉద్యమం: భూమన అభినయ్ రెడ్డి
              ప్రతి నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల ఉద్యమం చైతన్యం కలిగిస్తోందని భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తలవంచకపోతే పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.

ప్రజలపై కక్షతో వైద్య విద్యను ప్రైవేటీకరించడం దుర్మార్గం:మేయర్ డాక్టర్ శిరీష
         జగనన్న పాలనలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన వైద్య విద్యను ప్రస్తుత ప్రభుత్వం కక్షతో ప్రైవేటీకరించడం దుర్మార్గమని మేయర్ డా శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతోంది:రాజశేఖర్ బాబు
              ప్రచార విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు విస్తృత స్థాయిలో కొనసాగుతున్నాయని వైఎస్ఆర్ సిపి ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ బాబు అన్నారు.ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి అవగాహన కల్పించడం మా బాధ్యత అన్నారు. 

 కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బీరేంద్ర వర్మ, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి పావని, జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క సురేష్ నాయక్ పాల్గొన్నారు.అలాగే పెద్ద ఎత్తున విద్యార్థి మరియు యువజన నాయకులు పాల్గొన్నారు.

Back to Top