కేజీబీవీ విద్యార్థినుల‌కు ప‌రామ‌ర్శ‌

విజ‌య‌న‌గ‌రం:  విజయనగరం జిల్లా గుర్లలోని కేజీబీవీ స్కూల్ భోజనశాలలో రాత్రి బాలికలు భోజనం చేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో మంట‌లు చెలరే బెడ్స్, ఇతర సామగ్రి కాలిపోయాయి. అలాగే ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గుర‌య్యారు.  వీరికి వైద్య‌శాల‌లో చికిత్స‌లు అందిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, జెడ్పీ చైర్మ‌న్  మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు జిల్లా అధికారుల‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు. బుధ‌వారం ఉద‌యం నెల్లిమర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల‌ను ఆయ‌న పరామ‌ర్శించారు. ప్రస్తుతానికి బాలిక‌ల‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంద‌ని, ఇవాళ డిశ్చార్జ్ చేస్తార‌ని తెలిపారు.   

Back to Top