గోశాల నిర్వ‌హ‌ణ స‌రిగ్గా లేద‌ని టీటీడీ చైర్మ‌నే ఒప్పుకున్నారు

ఈ మాట చెప్పిన నాపై కేసు పెట్టిన భానుప్ర‌కాష్‌రెడ్డి.. టీటీడీ చైర్మ‌న్‌పై కేసు పెట్ట‌గ‌ల‌రా..?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

తిరుప‌తి:  టీటీడీ గోశాల నిర్వ‌హ‌ణ సరిగ్గా లేద‌ని టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడే అంగీక‌రించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ విష‌యం తాను చెప్పాన‌ని టీటీడీ బోర్డు స‌భ్యుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి కేసు పెట్టాడ‌ని, ఇప్పుడు చైర్మ‌న్ బీఆర్ నాయుడుపై కూడా కేసు పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. బోర్డ్ మెంబ‌ర్ భానుప్ర‌కాశ్‌రెడ్డిని నాపై ఉసిగొల్పి కేసు పెట్టించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. త‌న‌పై ఏ సెక్షన్లతో అయితే కేసులు రిజిస్టర్ చేయించినారో.. అదే కేసు టీటీడీ చైర్మ‌న్‌కూ వర్తిస్తుందా అని నిల‌దీశారు. బుధ‌వారం భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`గోశాల నిర్వహణ సరిగ్గా లేదు అనే విషయం బోర్డు దృష్టికి వచ్చింది అని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు స్వయంగా చెప్పారు. గోశాల నిర్వహణకు  ప్రత్యేక కమిటీని వేసి నిపుణుల కమిటీని వేసి గోశాలను స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై  నిర్ణయం తీసుకుంటామంటున్నారు. నేను బిఆర్ నాయుడుకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ..సరిగ్గా ఏప్రిల్ నెలలో నేను గోశాల నిర్వహణ సరిగ్గా లేనందువలన గోవులకు అపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, గోవుల మరణాలు జరిగాయని చెప్పాను.

బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని నాపై ఉసిగొల్పి నా మీద గోవుల మరణంపై నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నాన‌ని  నామీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్  చేయించారు.  కేసు రిజిస్టర్ కూడా చేశారు, నేను విచారణకు హాజరుఅయ్యాను. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా బి.ఆర్ నాయుడు నిన్న పత్రికా సమావేశంలో బహిరంగంగా గోశాల నిర్వహణ సరిగ్గా లేని కారణంగా అన్నటువంటి మాట మాట్లాడారు కదా? మరి నా మీద ఏ సెక్షన్లతో అయితే మీరు కేసులు రిజిస్టర్ చేయించినారో? అదే విషయాన్ని ప్రస్తావించినటువంటి బీఆర్ నాయుడు మీద‌ కూడా ఈ సెక్ష‌న్లు వర్తిస్తాయా?.  గోశాల సంరక్షణ బాధ్యత సరిగ్గా లేదు అని చెప్పిన దానికి నామీద మీరు అనేక నిందారోపణలు వేసి నన్ను గోశాలకు షాలకు రానివ్వకుండా 8 మంది శాసనసభ్యులతో అక్కడ పెద్ద ఎత్తున రాద్దాంతం చేయించి పాలకమండలి సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. నన్ను ఇంటి దగ్గరేమో  నిర్బంధించి అక్కడున్నటువంటి వాస్తవాల అన్నింటిని కూడా రూపుమాపు చేసినటువంటి విషయం లోక విదితమే.  దాదాపు 70ఏళ్ల టీటీడీ ఆధ్వర్యంలో అతి గొప్పగా నిర్వహిస్తున్న గోశాలను మీరు టీటీడీ అధ్యక్షుడు అయిన తర్వాత నిర్వీర్యం అయిపోయింది.  దీన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన రావటం కూడా తప్పే కదా.  మీ హయాంలో మీరు వైకుంఠ ఏకాదశి నిర్వహణను సరిగ్గా చేయలేరు , గోశాల ను సరిగ్గా నిర్వహించలేరు అంటే మీ పాలకమండలి నిర్వాహంలో మీరు ఏ విషయాన్ని కూడా సమర్థవంతంగా చేయలేరు. నేను ఒక వాస్తవాన్ని ప్రజల ద్వారా మీకు తెలియజేసే అటువంటి ప్రయత్నమే ఆ రోజు చేశా . అకారణంగా నామీద మీరు అనేక సెక్షన్లతో కేసులు పెట్టినారు ఈ రోజున వాస్తవం మీరే చెప్పేశారు. గోషాల నిర్వహణ సరిగా లేదు అన్నటువంటి విషయం సాక్షాత్తు టిటిడి పాలకమండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు  చెప్పారు. ఈ నిర్వహణ సరిగ్గా లేని కారణంగా దీనిని స్వచ్చంద సేవా సంస్థలకు ఇవ్వాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నాము .  యావత్ ప్రపంచానికి నా ద్వారా కూడా తెలియజేస్తూ మీరు పెట్టిన కేసులన్నీ కూడా నన్ను భయపెట్టడానికి పెట్టినవే తప్ప మరొకటి కాదని నేను ఆరోజున బహిర్గతం చేసినందువలన మీరు ఈరోజు వాస్తవాన్ని ఒప్పుకున్నారు. మీరు  ఇలాంటి తప్పులు ఎన్ని  చేసిన ఆ తప్పుల్ని ఎత్తి చూపటమే ఒక పూర్వ అధ్యక్షుడిగా నా బాధ్యత` అని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.  

Back to Top