కూటమి ప్రభుత్వంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువు

ఎంపీ త‌నుజా రాణి ఫైర్‌

అర‌కు:  కూట‌మి ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ డాక్ట‌ర్  త‌నుజా రాణి మండిప‌డ్డారు. ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు?. ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం దేశంలో మరెక్కడైనా జరుగుతుందా?. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత మీరెందుకు నోరు మెదపడం లేదు?. కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది. కూటమి నేతలు పరిపాలన పక్కనపెట్టి వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తల పైన కేసులు పెట్టడంలోనే నిమగ్నమయ్యారు` అని తనుజా రాణి మండిప‌డ్డారు,

Back to Top