బీసీ మ‌హిళ‌పై దాడి జ‌రిగితే సీఎంకు క‌న‌బ‌డ‌టం లేదా?

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు వేమారెడ్డి, ఎమ్మెల్సీ హ‌నుమంత‌రావు

తాడేప‌ల్లి: కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌ పర్సన్‌, బీసీ మ‌హిళ ఉప్పాల హారిక పై జరిగిన దాడి జ‌రిగితే సీఎం చంద్ర‌బాబుకు క‌న‌బ‌డ‌టం లేదా అని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ హ‌నుంత‌రావు మండిప‌డ్డారు. హ‌రిపై దాడిని వారు తీవ్రంగా ఖండించారు. బీసీ మహిళ మీద  జరిగిన దాడికి ప్ర‌భుత్వ‌మే బాద్య‌త వ‌హించాల‌ని హెచ్చ‌రించారు. `రాష్ట్రంలో కూటమి గుండాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ మహిళపై ఈ రకంగా దాడి చేయడం హేయం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇలా ప్రజా ప్రతినిధుల పైన జిల్లా ప్రథమ పౌరురాలయినా బీసీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు క్షమాపణ చెప్పాలి` అని వారు డిమాండ్‌ చేశారు.

Back to Top