తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన ఆలూరు సాంబశివారెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల కారణంగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అందుబాటులో లేనందున, వారు తిరిగి వచ్చేవరకు ఆలూరు సాంబశివారెడ్డి తాత్కాలికంగా పార్టీ అనుబంధ విభాగాల వ్యవహారాలను పర్యవేక్షిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.