తాడేపల్లి: జులై 8న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర (బీసీ కమ్యూనిటీ) విభాగాల సాధికార అధ్యక్షులతో అప్పిరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైయస్ఆర్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించి దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ను మరోసారి గుర్తుచేసుకుందామని, అనుబంధ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఏమన్నారంటే... ఈ నెల 8 న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలన్నీ కూడా రాష్ట్రస్ధాయి నుంచి మండల స్ధాయి వరకూ అధ్యక్షులు, కమిటీలు కూడా ఇప్పటికే నియమించుకున్నాయి. ఈ క్రమంలో జులై 8 న జయంతి కార్యక్రమానికి సంబంధించి ప్రతి అనుబంధ విభాగం నాయకులంతా పెద్ద ఎత్తున నిర్వహించాలి. రాష్ట్రస్ధాయి నుంచి జిల్లా స్ధాయి, నియోజకవర్గ స్ధాయిలో అందరూ సమన్వయం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి మధ్య సమన్వయంతో అన్ని అనుబంధ విభాగాలు కలిసి పనిచేసి జయంతి కార్యక్రమాలను, వివిధ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్ళాలి. ఇప్పటికే యువజన విభాగం మంచి సమన్వయంతో పనిచేసి అందరి మన్ననలు పొందింది, మిగిలిన విభాగాలు కూడా ఇదే విధంగా రాష్ట్రస్ధాయి నుంచి మండల స్ధాయి వరకు కోఆర్డినేషన్ ఉండాలి. అన్ని విభాగాలు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్ళాలి, రాష్ట్రస్ధాయి నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షణ కూడా ఉంటుంది. అన్ని విభాగాలు క్రియాశీలకంగా పనిచేసి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని లేళ్ళ అప్పిరెడ్డి కోరారు.