వైయ‌స్‌ జగన్ ఇచ్చిన రీకాల్  పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

హామీలు అమలు చేయని చంద్రబాబును రీకాల్ చేయాల్సిందే

పార్టీతో నిమిత్తం లేకుండా జగన్ పేదలకు పథకాలు అమలుచేశారు 

కూటమి ప్రభుత్వం పథకాల ఎంపికలో పక్షపాతం చూపడం దారుణం 

ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి 

బూత్ స్థాయినుంచి పార్టీని పటిష్టం చేసుకుందాం 

నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసాం .. ప్రజల్లోకి ధైర్యంగా వెళ్దాం 

కూటమి ప్రభుత్వంలో జరిగే అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుదాం 

ఏడాది కాలంలోనే పెద్దఎత్తున వ్యతిరేకత తెచ్చుకున్న ఘనత  కూటమి ప్రభుత్వానిదే 

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గల్లంతు కావడం ఖాయం 

సిటీ వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎంపీ భరత్ 

రాజమహేంద్రవరం : హామీలు నిలబెట్టుకోలేని చంద్రబాబును రీకాల్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని  వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ   మార్గాని భరత్ రామ్ పిలుపు నించ్చారు.  ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ఎప్పుడూ శ్రద్ధచూపలేదని , అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి మరోసారి ప్రజలను మోసం చేసారని ఆయన అన్నారు. భరత్ ఆధ్వర్యంలో స్థానిక వి ఎల్ పురం మార్గాని ఎస్టేట్ లోని సిటీ వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో  భరత్ ఆధ్వర్యంలో   రాజమండ్రి సిటీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ  విసృత స్థాయి సమావేశం జరిగింది.  
  ఈసందర్బంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గత ఎన్నికల సందర్బంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యకర్తల దృష్టికి తీసుకువచ్చారు. హామీలు ఇవ్వడం వాటిని నెరవేర్చకపోవడం చంద్రబాబుకి కొత్తకాదన్నారు. 2014ఎన్నికల్లో జాబ్ కావాలంటే బాబు రావాలి అనే నినాదం ఇచ్చి గాలికి వదిలేశారని, అలాగే మొన్నటి ఎన్నికల్లో కూడా సూపర్ సిక్స్ తో సహా ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని భరత్ అన్నారు. సమాజంలో పేదవాళ్ళు మంచి స్థానంలో ఉండాలని జగన్మోహన్ రెడ్డి కాంక్షించి పేదలు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసారని ఆయన  అన్నారు. 2019నుంచి 2024వరకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ అమలు చేసారని భరత్ చెప్పారు. పార్టీ చూడకుండా పేదవాళ్ళు అయితే చాలు పథకాలను వర్తింపజేశారని ఆయన అన్నారు. తనుచనిపోయిన తర్వాత తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో జగన్ అందరినీ ఒకేలా చూసారని భరత్ పేర్కొన్నారు.   ప్రస్తుతం చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా ఉన్న పథకాల్లో కూడా పార్టీ ని బట్టి అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వివక్షతను  నిరసించాలన్నారు. 
   తన హయాంలో రాజమండ్రి రూపురేఖల్ని మారుస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను జగన్ సహకారంతో చేయగలిగామని భరత్ అన్నారు. 2019కి ముందు రాజమండ్రి ఎలా ఉందొ, తన హయాంలో ఎలా ఉందొ అర్ధం అందరికీ తెలుసునన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎం ప్రభావం కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారం కావచ్చు , టిడిపితో పవన్ కళ్యాణ్, బిజెపి కలిసి వైయ‌స్ఆర్‌సీపీపై దాడి చేసిన విధానం వలన కావచ్చు 2024లో కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చిందని ఆయన అన్నారు. , అయితే ఏడాది  కాలంలో ఇంతవ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడా లేదని భరత్ అన్నారు. పథకాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలు వాస్తవాలు మరిచిపోరని ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటే డా వైఎస్సార్ పేరే గుర్తుకి వస్తుందని,  ఫీజు రీ ఇంబర్స్ మెంట్ కూడా డా వైఎస్ గుర్తొస్తారని, అలాగే అమ్మవడిని తల్లికి వందనంగా  మార్చినా సరే,  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గుర్తొస్తారని భరత్ అన్నారు. 
   ఏ ఎన్నిక వచ్చినా వైయ‌స్ఆర్‌సీపీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని, ఎట్టి పటిస్థితుల్లో రాజమండ్రిలో వైయ‌స్ఆర్‌సీపీ గెలిచేలా చేద్దామని    పొరపాట్లు ఏమైనా ఉంటె సరిదిద్దుకుని అందరూ ఐక్యంగా పనిచేద్దామన్నారు.   
   ఈసందర్బంగా భరత్ మాట్లాడుతూ వార్డు ప్రెసిడెంట్లు, వార్డు ఇంచార్జి, పార్టీ అనుబంధ విభాగ ప్రెసిడెంట్లు అందరూ కల్సి ప్రతి వార్డులో పార్టీని పటిష్టం చేసుకుందామని అన్నారు. సిటీ నియోజక వర్గంలో ప్రతి వార్డులో  10మందితో కమిటీ అలాగే ప్రతి బూతులో  పదిమందితో కమిటీ ఉండేలా చేసుకుందామని తద్వారా అన్ని బూతుల్లో కల్పి 2,350మంది నిఖార్సైన కార్యకర్తల బలం ఉంటుందని భారత్ అన్నారు. వార్డులను పటిష్టం చేసుకుని పార్టీ పిలుపు ఇచ్చిన అన్ని కార్యక్రమాలను జయప్రదం చేస్తే,  రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో పోటీచేయాలను కునే వార్డు ఇంచార్జికి అవకాశం కల్పిస్తామని ఆయన హర్షద్వానాల మధ్య ప్రకటించారు. వార్డుల్లో, బూత్ లలో కమిటీలు ఉంటాయి కనుక ఎన్నికలకు వెళ్లడం సులభంగా ఉంటుందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పటిష్టమైన క్యాడర్ ఉన్నా సరే, టిడిపి చేసిన దుష్ప్రచారం కారణంగా గానీ, ఈవీఎం ల వలన కానీ  ఇబ్బంది పడ్డామని, అయితే ఒక వార్డుకి 60,70మందితో పటిష్టంగా కేడర్ నిర్మాణం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. 

అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు: వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులకు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు  

 సంక్షేమం అంటే ఏమిటో తన పథకాల ద్వారా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు.  కూటమి ప్రభుత్వం హామీలు అమలుచేయక పోవడాన్ని నిరసిస్తూ వైయ‌స్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు బాబు స్యురిటీ మోసం గ్యారంటీ అంటూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు వాస్తవాలు  వివరించే ప్రక్రియను ఐదువారాల్లో పూర్తిచేయాలని సూచించారు. వైయ‌స్ జ‌గ‌న్‌ అమలుచేసిన పథకాలు అమలుతో పాటు అదనంగా కొన్ని పథకాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 13నెలలు అయినా అమలు చేయడం లేదన్నారు. హామీలు అమలుచేయకుండా మోసం చేయడం దారుణమన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి పథకాల ద్వారా డా రాజసుఖరరెడ్డి, అమ్మవడి, వాహనామిత్ర వంటి నవరరత్నాల ద్వారా జగన్ ప్రజల్లో నిలిచారని అన్నారు. హామీలు చేయకుండా  చంద్రబాబు ప్రజలను మోసం చేసారని, అందుకే జగన్ చేసిన కార్యక్రమాలను ప్రజలు తలచుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో నాయకులు గానీ, కార్యకర్తలు గానీ స్వార్ధంతో ఆలోచించి ఏ కార్యక్రమం చేయలేదని చెల్లుబోయిన వేణు స్పష్టంచేసారు. అందరికీ పథకాలను వర్తింపజేసామన్నారు. కావాలని పనిగట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులమీద నిందలు మోపుతున్నారని ఆయన వాపోయారు. రేషన్ బియ్యం హాస్టల్ పిల్లలు తినడానికి పనికి రావని సాక్షాత్తూ ప్రస్తుత ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి చెప్పారని వేణు గుర్తుచేసారు. మరి పిల్లలకు పనికిరాని బియ్యం పెద్దలకు పనికొస్తాయా అని ప్రశ్నించారు. మళ్ళీ అదే బియ్యం అమ్మేసుకుని ఎగుమతి చేసేస్తున్నారని నిందలు మోపుతున్నారని  ఆయన వాపోయారు. పనికారని బియ్యాన్ని రేషన్ ద్వారా ఎందుకు పంచుతున్నారని నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపు నిచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన ట్రీట్ మెంట్ ఇస్తారని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా ప్రజాపక్షం వహిస్తున్నామని వేణు స్పష్టంచేసారు. నిజాలు ప్రజలకు చెబుతున్న సాక్షి ఛానల్ రాకుండా చేస్తున్నారని, అయితే కేబుల్ బిల్లు కోసం వచ్చేవారికి సాక్షి ఛానల్ చూపించకపోతే బిల్లు చెల్లిచేది లేదని స్పష్టంగా చెప్పాలని వేణు అన్నారు. 
  రాజమండ్రి అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే  తిప్పల గురుమూర్తి రెడ్డి , బిసి సంఘాల జె ఏసీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, చందన నాగేశ్వర్, తదితరులు మాట్లాడారు. ఈసందర్బంగా బాబు స్యురిటీ మోసం గ్యారంటీ ప్రచారం కోసం చంద్రబాబు రీకాలింగ్   క్యూ ఆర్ కోడ్ పోస్టర్ లను ఆవిష్కరించారు.

Back to Top