కూటమి మోసాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపు

పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం 

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా:  కూటమి ప్రభుత్వం నమ్మించి చేసిన మోసాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. కూట‌మి ప్రభుత్వ మ్యానిఫెస్టోని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ చేసి చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టాల‌న్నారు. శ‌నివారం పార్వతీపురం ప‌ట్ట‌ణంలోని రాయల్ కన్వెన్షన్ హాల్లో  ‘ చంద్రబాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంపై స‌న్నాహాక స‌మావేశం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ కుర‌సాల క‌న్న‌బాబు, శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, విజయనగరం జిల్లా అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, అరకు ఎంపీ గుమ్మ తనుజారాణి, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.   ఈ సంద‌ర్భంగా క‌న్న‌బాబు మాట్లాడుతూ..‘మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి.  ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాండ్లు రాసి పేద ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంవత్సరం దాటిపోయింది మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమైపోయాయి..?, సూపర్ సిక్స్ హామీలు.. అన్ని ఇచ్చేసాను ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ నాలుక మందం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తాటతీస్తాను మధ్యలో ఇరగ కొడతా అంటున్నాడు. 

పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగా కోరులు : బొత్స స‌త్యనారాయ‌ణ‌
పేద ప్రజల పక్షాన ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమినేతల మెడలు వంచుతాం. చంద్రబాబు పాలన ఎప్పుడు వచ్చినా మహిళలు రైతులు నష్టపోతు ఉంటారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రండి గ్రామాల్లోకి వెళదాం... ఎవరి తాటతీస్తారో తేలిపోతుంది. చంద్రబాబు వచ్చి 100 అబద్ధాలు చెబుతాడు..లోకేష్ వచ్చి... 200 అబద్ధాలు చెబుతాడు. అన్నదాత సుఖీభవ రూ. 20000 ఇస్తా అన్నారు సంవత్సరమైంది ఎవరికైనా ఇచ్చారా....?, ప్రజల సమస్యలపై పోరాడటం మా పార్టీ ధ్యేయం.  రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా....?, సిండికేట్లుగా మారి ఆక్వా రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ’ అని బొత్స స‌త్యనారాయ‌ణ‌ విమ‌ర్శించారు. 

Back to Top