తాడేపల్లి: దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి 76వ వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు న్యూజిలాండ్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. న్యూజిలాండ్ మాజీ మంత్రివర్యులు మైకల్ వుడ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ నెల్లూరి బుజ్జిబాబు మాట్లాడుతూ వైయస్‌ఆర్ సామాన్య ప్రజల అవసరాలను గుండెల్లో వేసుకుని పాలన సాగించిన గొప్ప నేతగా ప్రశంసించారు. ఆయన ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ లాంటి పథకాలు ప్రపంచంలోనే తొలిగా అమలైన ప్రగతిశీల కార్యక్రమాలుగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ వారసత్వాన్ని గ్రామ వాలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య, విద్యా రంగాల్లో విస్తృతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గౌరవ అతిథులు: 1. శ్రీ అలూరు సంబ శివ రెడ్డి గారు – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 2. శ్రీమతి ఆరే శ్యామల రెడ్డి గారు – అధికార ప్రతినిధి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 3. శ్రీ జి. శాంత మూర్తి – వ్యవస్థాపకులు, Our State Our Leader & YSR ఇంటెలెక్చువల్ ఫోరమ్ 4. శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారు – అధికార ప్రతినిధి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూజిలాండ్ నుండి గౌరవ అతిథులు: 1. శ్రీ శివ కిలారి గారు – డైరెక్టర్, యూనివర్సల్ గ్రానైట్స్ & చలన చిత్ర నిర్మాత 2. శ్రీ గోవర్ధన్ మల్లెలా గారు – డైరెక్టర్, TAXNZ 3. శ్రీమతి ఇంద్ర సిరిగిరి గారు – డైరెక్టర్, లింక్ టూ గ్రూప్ సర్వీసెస్ 4. శ్రీ కళ్యాణ్ కాసుగంటి గారు – అధ్యక్షుడు, తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ & ప్రధాన కార్యదర్శి, NZ ఇండియన్ అసోసియేషన్ 5. శ్రీమతి శ్రీదేవి కూనపరెడ్డి – ఉపాధ్యక్షురాలు, మన ఆంధ్రా తెలుగు అసోసియేషన్ 6. శ్రీ అరుణ్ రెడ్డి గారు – అధ్యక్షుడు, NZ తెలుగు అసోసియేషన్ 7. శ్రీ చంద్రశేఖర్ కొడూరి – అధ్యక్షుడు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ NZ 8. శ్రీ బాల వేణుగోపాల్ రెడ్డి బీరం – ప్రముఖ రాజకీయ నాయకుడు, న్యూజిలాండ్ 9. శ్రీమతి శ్రీలత మగతాల & శ్రీ జగదీశ్వర్ రెడ్డి – మాజీ అధ్యక్షులు, NZ తెలుగు అసోసియేషన్ 10. శ్రీ నిర్మల్ కుమార్ – డైరెక్టర్, మాంగోబైట్ 11. శ్రీ పండు – డైరెక్టర్, లుక్స్మార్ట్ స్టోర్స్ 12. శ్రీ మురళి – డైరెక్టర్, నిధి చిట్స్ 13. శ్రీ రోహిత్ రెడ్డి – డైరెక్టర్, ట్రాన్స్‌పసిఫిక్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వైయఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూజిలాండ్ కమిటీ: నెల్లూరి బుజ్జిబాబు – కన్వీనర్ ఆనంద్ రెడ్డి ఎద్దుల – కో-కన్వీనర్ సమంత్, రాజా రెడ్డి, గీతా రెడ్డి, విజయ్, జిమ్మీ, బాల శౌరి, రమేష్, సంకీర్త్, పార్థ తదితరులు పాల్గొన్నారు.