చంద్రబాబు ఎప్పటికీ మోసగాడే

వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన, మాజీ మంత్రి రోజా

న‌గ‌రిలో `చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..కార్య‌క్ర‌మం

చిత్తూరు: హామీలిచ్చి విస్మరించిన చంద్రబాబు ఎప్పటికీ మోసగాడేన‌ని  వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన, మాజీ మంత్రి రోజా మండిప‌డ్డారు. న‌గ‌రిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వ‌ర్యంలో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ..`మోసపూరిత మేనిఫెస్టోతో చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టించారు. ఇచ్చిన ప్రతి హామీని వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి నెరవేరిస్తే అంతకన్నా ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పింఛన్‌ తప్ప ఏమీ అందిచలేదు. వైయ‌స్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి 30 లక్షల మందికి కోతలు పెట్టి తల్లికి వందనం అమలుచేశారు. 3 అంకణాలకు మించి ఉన్నా, రూ.300 విద్యుత్‌ బిల్లు ఉన్నా రూ.8,020 మాత్రమే వేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి సంతకాలు చేసిన బాండ్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు. గెలిచాక యథాప్రకారం ప్రజలను మోసం చేశారు. ఎన్ని హామీలు ఇచ్చారు, ఏవి అమలు చేయలేదు అని క్షేత్రస్థాయి వరకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమ ఉద్దేశం. జగనన్న చేసిన మంచిని చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజెప్పడం ప్రతి కార్యకర్త బాధ్యత` అని గుర్తు చేశారు. 

Back to Top