ఖ‌జానాపై ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అధికారమా?

ఇది రాజ్యాంగ ఉల్లంఘ‌న కాదా

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన ఫైర్ 

తాడేపల్లి: ఖ‌జానాపై ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అధికారమా? ఇది రాజ్యాంగ ఉల్లంఘ‌న కాదా అని మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ, ప్రయివేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పించిన విషయాన్ని అంగీకరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.     
రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ, రాష్ట్ర ఆర్ధిక విధానాన్ని అస్తవ్యస్తం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై జాతీయ మీడియాలో సైతం వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు వివరణ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఒక జవాబుదారీతనం, పారదర్శకత అనేదే లేకుండా పరిపాలన చేయటం దారుణం. హైకోర్టులో ఈ విషయమై కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్ల నిధులు సమీకరించటానికి బాండ్లు జారీ చేయించింది. రూ.లక్షా 91 వేల కోట్ల విలువైన రాష్ట్ర ఖనిజ సంపదను తాకట్టు పెట్టారు. ప్రభుత్వం అప్పు తీర్చకపోతే ప్రయివేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించటం రాజ్యాంగ విరుద్దమని సూచించారు. 
 

Back to Top